Assam Floods: అస్సోంలో భారీ వర్షాలు, పోటెత్తుతున్న వరద, 25 వేలమంది నిరాశ్రయులు, మృతుల సంఖ్య ?

Assam Floods: అస్సోంలో భారీ వర్షాలతో అతలాకుతలమౌతోంది. వరద పోటెత్తుతోంది. వరదల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందగా..25 వేల మంది నిరాశ్రయులయ్యారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 15, 2022, 06:48 PM IST
Assam Floods: అస్సోంలో భారీ వర్షాలు, పోటెత్తుతున్న వరద, 25 వేలమంది నిరాశ్రయులు, మృతుల సంఖ్య ?

Assam Floods: అస్సోంలో భారీ వర్షాలతో అతలాకుతలమౌతోంది. వరద పోటెత్తుతోంది. వరదల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందగా..25 వేల మంది నిరాశ్రయులయ్యారు.

అస్సోం వరదలతో అల్లకల్లోలమౌతోంది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో దాదాపు 25 వేలమంది వరదల కారణంగా నిరాశ్రయులయ్యారు. దీమా హసోవో జిల్లాలోని హాఫ్‌లోగ్ ప్రాంతంలో భూమి కోతకు గురవడంతో ఓ మహిళ సహా ముగ్గురు మృతి చెందారు. 

ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్న కోపిలి నది

అస్సోం సహా పొరుగు రాష్ట్రాలు మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌లలో గత కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా నదుల్లో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా కోపిలి నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది. అస్సోంలోని  కఛార్, ధోమాజీ, హోజయీ, కార్బీ ఆంగ్‌లోంగ్ పశ్చిమ్, నాగావ్, కామ్‌రూప్ జిల్లాల్లోని 94 ఊర్లలో దాదాపు 24 వేల 681 మంది వరదల కారణంగా నిరాశ్రయులయ్యారు.

వరద ప్రభావిత జిల్లాల్లో 1732.72 హెక్టార్లతో పంటలు నాశనమయ్యాయి. ఒక్క కఛార్ జిల్లాలోనే 21 వేల కంటే ఎక్కువమంది నిరాశ్రయులయ్యారు. ఆర్మీ, పారా మిలిటరీ, ఎస్డీఆర్ఎప్, అగ్నిమాపక, విపత్తు దళాలు కఛార్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో 2 వేల 150 మందిని రక్షించారు. అస్సోంలో వరదల కారణంగా హోజయీ, లఖీమ్‌పూర్, నాగావా్ జిల్లాల్లో చాలా రోడ్లు వంతెనలు, ధ్వంసమయ్యాయి.

Also read: Sharad Pawar: శరద్‌ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు..మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి చెంప చెళ్లు! వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News