కన్ను కొట్టిన సీన్ గుర్తుచేస్తూ రాహుల్ పై అమిత్ షా సెటైర్లు

                                          

Updated: Aug 10, 2018, 04:41 PM IST
కన్ను కొట్టిన సీన్ గుర్తుచేస్తూ రాహుల్ పై అమిత్ షా సెటైర్లు

లోక్ సభలో కన్ను కొట్టిన సీన్ మరోసారి గుర్తు చేస్తూ  రాహుల్ గాంధీకి అమిత్ షా చురకలు అంటించారు. రాహుల్ జీ.. కన్ను కొట్టడం నుంచి తీరిక దొరికితే జర ఇటు చూడండి .....ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని మరింత పటిష్ఠం  చేసేందుకు చట్ట  సవరణ తీసుకురావాలని మోడీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది... ఇదంతా చూడకుండా మీరు అక్కడ ఆందోళన ఎందుకు చేస్తున్నారు. అంటూ షా వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తూ ట్వీట్ చేశారు

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎస్సీ, ఎస్టీ చట్టంపై మోడీ సర్కార్ వైఖరిని నిరసిస్తూ  దళిత, గిరిజన సంఘాలులతో కలిసి రాహుల్ గాంధీ , సీపీఎం నేత సీతారాం ఏచూరి పాల్గొన్న ఫోటోలను ఈ ట్వీట్ కు అమిత్ షా జత చేశారు.

మోడీ సర్కార్ పై టీడీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చిన సమయంలో రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రధాని మోదీని కౌగిలించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం మరో కాంగ్రెస్ నేతతో మాట్లాడుతూ కన్నుగీటారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే. కాగా ఈ అంశం ఆధారంగా చేసుకుని బీజేపీ చీఫ్ అమిత్ షా రాహుల్ పై ఇలా సెటైర్లు వేశారు.