బ్యాంక్ ఖాతాదారులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్

Bank Deposit insurance cover Hikes | గతంలో బ్యాంకులు దివాలా చేసిన సమయంలో డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు ఇన్సూరెన్స్ నగదు కేవలం లక్ష రూపాయలు మాత్రమే లభించేది. తాజా ప్రతిపాదనతో రూ.5లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది.

Last Updated : Feb 1, 2020, 02:55 PM IST
బ్యాంక్ ఖాతాదారులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నాడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2020లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంక్ కస్టమర్లకు తీపి కబురు అందించారు. బ్యాంకులో డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పరిమితిని ఐదు రెట్లు పెంచుతున్నట్లు ప్రతిపాదించారు. ఇప్పటివరకూ బ్యాంక్ డిపాజిట్లపై కేవలం రూ.1 లక్ష మాత్రమే ఇన్సూరెన్స్ లభిస్తుండగా.. ఆ పరిమితిని తాజాగా రూ.5లక్షల వరకు పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. ఈ నిర్ణయంపై బ్యాంకు ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: రైతులకు శుభవార్త.. 16 సూత్రాల పథకంతో పాటు కొత్త స్కీమ్

బ్యాంక్ దివాలా తీసి మూసివేస్తే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) బాధిత ఖాతాదారులకు ఇన్సూరెన్స్ నగదు చెల్లిస్తుంది. బ్యాంక్ డిపాజిట్ ఇన్సూరెన్స్ పెంపుదలతో ఖాదాదారులకు భారీగా ప్రయోజనం కలగనుంది. గతంలో బ్యాంకులు దివాలా చేసిన సమయంలో డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు ఇన్సూరెన్స్ నగదు కేవలం లక్ష రూపాయలు మాత్రమే లభించేది. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ తాజాగా చేసిన ప్రతిపాదన అమల్లోకి వచ్చాక ఏదైనా బ్యాంకు దివాలా తీస్తే.. డిపాజిట్లు చేసిన ఖాతాదారులు ఒక్కొక్కరికి భారీ మొత్తంలో రూ.5లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది.

Also Read: మహిళలకు గుడ్ న్యూస్.. మోదీ సర్కార్ కొత్త స్కీమ్

సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు.. ఇలా అన్ని రకాల ఖాతాదారులకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఆర్థిక బలోపేతం అనేది దేశానినికి కీలకమని, ఆర్థికాంశాలతో సేవలందించే బ్యాంకులపై ఈ ప్రతిపాదన చేసినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 3.5 కోట్ల రూపాయల మూలధనాన్ని పీఎస్‌యూ బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News