Chandigarh: పంజాబ్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ ఛార్జీ(power tariff)లను యూనిట్‌కు మూడు రూపాయలు తగ్గించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తగ్గిన విద్యుత్ ఛార్జీలు(electricity rates) సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ స్పష్టం చేశారు.
ఒక్కో యూనిట్ ధరను రూ.3 తగ్గించినట్లు సీఎం(Punjab Chief Minister Charanjit Singh Channi) పేర్కొన్నారు. దీంతో దేశంలోనే అతి తక్కువ విద్యుత్ ఛార్జీలు ఉన్న రాష్ట్రంగా పంజాబ్(Punjab) నిలిచిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త ఛార్జీలు అమలవుతాయని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 69లక్షల గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఏడాదికి ప్రభుత్వ ఖజానాపై రూ.3,316కోట్ల భారం పడనుంది.
Also Read: Akhilesh Yadav: వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యను..అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన
డీఏ పెంపు..
విద్యుత్ ఛార్జీల తగ్గింపుతో పాటు.. రాష్ట్ర ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది పంజాబ్ సర్కార్. కరవు భత్యం(డీఏ)ను 11శాతం పెంచింది. ఈ మేరకు రాష్ట్ర కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook