Election Commission: మధ్యాహ్నం 3గంటలకు ఈసీ సమావేశం..జమ్ముకశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటన

Election Commission Of India: నేడు మధ్యాహ్నం 3గంటల కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం  కానుంది. జమ్ము కాశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే ఛాన్స్ ఉంది.   

Written by - Bhoomi | Last Updated : Aug 16, 2024, 09:48 AM IST
Election Commission: మధ్యాహ్నం 3గంటలకు ఈసీ సమావేశం..జమ్ముకశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటన

Four State Assembly Elections 2024: దేశంలో ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల తేదీలను  ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు  ప్రకటించనుంది. ఈ సమావేశానికి సంబంధించి ఎన్నికల సంఘం మీడియాకు ఆహ్వానం పంపింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ మీడియా సమావేశం జరగనుంది. హర్యానా అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 3న ముగియనుండగా, మహారాష్ట్ర అసెంబ్లీ నవంబర్ 26తో ముగియనుంది. జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తొలగించిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల కమిషన్ బృందం కూడా లోయను సందర్శించిన సంగతి తెలిసిందే. 

మే 2022లో జమ్మూ కాశ్మీర్‌లో డీలిమిటేషన్ తర్వాత, ఇప్పుడు అసెంబ్లీ స్థానాల సంఖ్య 90కి పెరిగింది. జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లు, కాశ్మీర్ లోయలో 47 సీట్లు ఉన్నాయి. గతంలో 2014లో 87 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో జమ్మూలో 37, కాశ్మీర్ లోయలో 46, లడఖ్‌లో 6 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 

 

 

 

 

Trending News