Maharashtra Sugar Mill Fire Accident: మహారాష్ట్రలోని అహ్మెద్ నగర్‌లో ఓ షుగర్ ఫ్యాక్టరీలో శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో రాజుకున్న మంటలు ఫ్యాక్టరీ మొత్తం విస్తరించి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గంగామై షుగర్ ఫ్యాక్టరీలో డిస్టిలరీ యూనిట్‌లో తొలుత పేలుడు సంభవించింది. ఈ పేలుడు కాస్తా భారీ అగ్ని ప్రమాదానికి దారితీసింది. ఘటన స్థలం నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రమాదం జరిగిన సమయంలో షుగర్ ఫ్యాక్టరీలో 70 నుంచి 80 మంది వరకు కార్మికులు ఉండగా... వాళ్లు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నారని తెలిసింది. కానీ రెస్క్యూ టీమ్ సహకారంతో వారిని వెలుపలికి తీసుకొచ్చారని సమాచారం అందుతోంది.
#BigBreaking शेवगाव तालुक्यातील गंगामाई साखर कारखाना डिस्टिलरी इथेनॉल प्लांटमध्ये भीषण आग...#fire #shevgoan #sugarfactory #ahmednagar #LatestNews pic.twitter.com/5RNJfR55OX
— Nilesh Rajendra Jadhav (@NileshJadhavR) February 25, 2023
అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు.. 10 ఫైర్ టెండర్స్ తో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తుగా ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ.. 8 మంది కార్మికులు గాయపడినట్టుగా సమాచారం అందుతోంది. కాలిన గాయాలతో బాధపడుతున్న కార్మికులను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి : 7th pay Commission News: 7వ పే కమిషన్ అమలు చేయకపోతే నిరవధిక ధర్నా.. ఉద్యోగ సంఘాల వార్నింగ్
ఇది కూడా చదవండి : Attack on Nisith Pramanik Convoy: కేంద్ర సహాయ మంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. ఇది వారి పనేనన్న మంత్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook