భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కశ్మీర్ లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదే సమయంలో అక్కడ అలజడులు సృష్టించి తద్వారా ఆ ప్రాంతంలో అశాంతి నెలకొనేలా చేయాలని ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.ఇందు కోసం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పలు చోట్ల దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిఘావర్గాలు నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి.
కశ్మీర్ లో రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్మీ, వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేరుకొని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు అప్రమత్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఉగ్ర చొరబాట్లను భగ్నం చేసిన భారత సైన్యం ..నిఘావర్గాల హెచ్చరికలతో మరింత అప్రమత్తమైంది.ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయి.