CA Exams 2020: సీఏ పరీక్షలు 2020 వాయిదా

ఛార్టెట్ అకౌంటెంట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. దేశ వ్యాప్తంగా నవంబరు తొలి వారంలో ప్రారంభం కావాల్సిన సీఏ పరీక్షలు (ICAI CA Exams 2020 Date) మూడో వారానికి వాయిదా పడ్డాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఏ పరీక్షలు వాయిదా వేసినట్లు ఐసీఏఐ తెలిపింది.

Last Updated : Oct 11, 2020, 12:09 PM IST
  • CA పరీక్షల తాజా షెడ్యూల్‌ను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది
  • నవంబరు తొలివారంలో నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపిన ఐసీఏఐ
  • నవంబరు మూడో వారంలో నిర్వహించనున్నట్లు ప్రకటించి షెడ్యూల్ విడుదల చేశారు
CA Exams 2020: సీఏ పరీక్షలు 2020 వాయిదా

హైదరాబాద్‌: ఛార్టెట్ అకౌంటెంట్ పరీక్షలు వాయిదా (ICAI CA Exams 2020 Postponed) పడ్డాయి. దేశ వ్యాప్తంగా నవంబరు 2, 3, 6, 7 తేదీల్లో నిర్వహించేందుకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ICAI) తొలుత షెడ్యూల్ జారీ చేసింది. అయితే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఛార్టెట్ అకౌంటెంట్ పరీక్షలు (CA Exams 2020) వాయిదా పడ్డాయి.

వాయిదా పడిన సీఏ పరీక్షలను నవంబరు 19, 21, 23, 25 తేదీల్లో (CA Exams 2020 Date) నిర్వహించనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 27న ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరపడం లేదని, బిహార్ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. సీఏ పరీక్షలు రాయనున్న విద్యార్థులు తాజా షెడ్యూల్‌ను గమనించాలని సూచించారు.

Trending News