Covid-19 Vaccine: 2020 చివరికల్లా వ్యాక్సిన్ రావచ్చు - కేంద్ర ఆరోగ్య మంత్రి
కోవిడ్-19 ( Covid-19 Vaccine) వ్యాక్సిన్ ను అంతం చేయడానికి భారత ప్రభుత్వం పలు ఫార్మా సంస్థలతో కలిసి పని చేస్తున్న విషయం తెలిసిందే.
కోవిడ్-19 ( Covid-19 Vaccine ) వ్యాక్సిన్ ను అంతం చేయడానికి భారత ప్రభుత్వం పలు ఫార్మా సంస్థలతో కలిసి పని చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని కుదిరితో ఈ సంవత్సరం ముగిసే లోపు కరోనావైరస్ ( Coronavirus ) వ్యాక్సిన్ వచ్చేస్తుంది అని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ( Dr Harsh Vardhan ) ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే దాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి భారత పౌరులకు పంపిణి చేస్తామని ఆయన తెలిపారు.
ప్రపంచం మొత్తం కరోనావైరస్ కు విరుగుడు వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం 26 వ్యాక్సిన్ లు క్లినికల్ ట్రయల్ కు చేరుకున్నాయి. భారత దేశంలో ఆరుకు పైగా వ్యాక్సిన్ లు టెస్టింగ్ లో ఉన్నాయి. ఇందులో మూడు వ్యాక్సిన్ ను ప్రయోగాల్లో ముందు ఉన్నాయి అని తెలిపారు. భారత దేశంలో నేడు ప్రతి రోజు పది లక్షల Covid-19 పరీక్షలు నిర్వహించగలుగుతున్నాం అని..1500 ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు.
మరోవైపు భారత దేశంలో కరోనాకేసుల సంఖ్య 30 లక్షలను ( 30,44,940 ) దాటింది. మరణాల సంఖ్య 56,706కు చేరుకుంది. ప్రస్తుతం 7,07,668 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 22 లక్షల మందికి పైగా కోలుకున్నారు.
ఇవి కూడా చదవండి
-
Chinese Party: ఈ చైనా వాళ్లు చేసిదంతా చేసి ఎలా పార్టీ చేసుకుంటున్నారో చూడండి
-
Lavender Oil Benefits: లావెండర్ ఆయిల్ వల్ల అనేక లాభాలు...ఎలా వినియోగించాలంటే…
-
Golden Turtle: నేపాల్ లో బంగారు వర్ణం తాబేలు... విష్ణుమూర్తి అవతారం అంటున్న ప్రజలు
-
Covid-19 Ointment: వచ్చేసింది కరోనాను అంతం చేసే ఆయింట్ మెంట్
-
-
Dawood Ibrahim: సెక్యూరిటీ ఏజెన్సీ చేతిలో దావూద్ పాస్ పోర్ట్ వివరాలు