ఐపీఎల్ 2018 బెట్టింగ్ కేసు: ఆరుగురు అరెస్ట్, పోలీసులకు సహకరిస్తానన్న అర్బాజ్ ఖాన్

ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఆరుగురి అరెస్ట్

Last Updated : Jun 3, 2018, 12:21 AM IST
ఐపీఎల్ 2018 బెట్టింగ్ కేసు: ఆరుగురు అరెస్ట్, పోలీసులకు సహకరిస్తానన్న అర్బాజ్ ఖాన్

ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు శనివారం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. డీసీపీ అభిషేక్ త్రిముఖె శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తులో భాగంగా మున్ముందు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం వుందని, దర్యాప్తులో వెలుగులోకొచ్చిన ఇంకొంత మంది కొత్త వ్యక్తులపై సైతం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టంచేశారు. అర్బాజ్ ఖాన్ గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు డీసీపీ స్పందిస్తూ బుకీ సోనూ జలాన్‌ని విచారించినప్పుడే అర్బాజ్ ఖాన్ పేరు బయటికొచ్చిందని, ఇవాళే అతడి వాంగ్మూలం సైతం తీసుకున్నామని చెప్పారు.

 

విచారణకు హాజరైన అనంతరం అర్బాజ్ ఖాన్ సైతం మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్ బెట్టింగ్ కేసులో పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను. ఇకపై కూడా వాళ్లకు దర్యాప్తులో సహకరిస్తాను అని స్పష్టంచేశాడు. పీటీఐ ప్రచురించిన ఓ కథనం ప్రకారం తాను ఐదారేళ్ల నుంచి క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్స్‌కి పాల్పడుతున్నానని అర్బాజ్ ఖాన్ ముంబై పోలీసులు ఎదుట అంగీకరించినట్టు తెలుస్తోంది. కాకపోతే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో తాను బెట్టింగ్‌కి పాల్పడలేదు అని అర్బాజ్ పోలీసులకు తెలిపినట్టు పీటీఐ కథనం స్పష్టంచేసింది. 

 

Trending News