IRCTC - Indian Railways: భారతీయ రైల్వేలకు దేశ ఆర్దిక వ్యవస్తకు ఆయువు పట్టు లాంటిది. ప్రపంచంలోనే నాల్గో పెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారతీయ రైల్వే ఉంది. రోజు కోట్లాది ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరవేడంలో కీలక భూమిక పోషిస్తుంది. అంతేకాదు లక్షలాది మంది రైల్వేలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఈ రైల్వే వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థకు తన వంతు సాయం చేస్తుంది. అంతేకాదు దేశంలోని జమ్మూ కశ్మీర్, లడ్డాక్ నుంచి కన్యాకుమారి వరకు ఆ మూలాగ్రం ప్రజలను అనుసంధానం చేయడంలో రైల్వేలది కీలక పాత్ర అని చెప్పాలి. కొన్నేళ్లుగా మన రెల్వే వ్యవస్థ ఎంతో రూపాంతరం చెందింది. ఒకప్పుడు రైల్ టికెట్ కోసం క్యూలో గంటల కొద్దీ ప్రయాణికులు నిలుచునే పని నుంచి టెక్నాలజీతో ఇంట్లోనే ఉంటూనే అన్ని రకాల పనులు చక్కదిద్దుకునే వరకు రైల్వే టెక్నాలజీ అప్‌గ్రేడ్ అయింది. అనేక సమస్యలకు సాంకేతికతో చెక్ పెట్టేసింది.
రెల్వే సేవలు పొందేందుకు ప్రత్యేక యాప్‌లున్నాయి. కొన్ని సార్లు మొరాయించడం వల్ల ప్రయాణికలు తీవ్ర ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలాంటి ప్రయాణికుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న రైల్వే అధికారులు ఓ సూపర్ యాప్‌ను డెవలప్ చేస్తున్నారు. ఇకపై అన్ని రకాల సేవలు ఈ యాప్లో అందుబాటులో ఉండే విధంగా వీటిని రెడీ చేస్తున్నారు. దీంతో రైల్వే ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టబోతుంది.
ఈ సూపర్ యాప్ టెక్నాలజీ పరంగా అద్భుతంగా ఉండబోతుందట. ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, రైలు ట్రాకింగ్ వంటివి ఈ యాప్‌లో చూసుకోవచ్చు. దీనితో పాటు టికెట్ వాపసు కోసం 24 గంటల సేవలను కూడా ప్రారంభించనుంది.
మరోవైపు ఐఆర్‌సీటీసీ (IRCTC) రైల్ కనెక్ట్ యాప్ భారతీయ రైల్వేలో అత్యంత పాపులారిటీ పొందిన మొబైల్ అప్లికేషన్‌గా గుర్తింపు పొందింది. ఈ యాప్‌ను దాదాపు 10 కోట్లకు పైగా డౌన్‌లోడ్ కలిగి ఉంది. ఈ యాప్‌తో పాటు రైల్ మదద్, యూటీఎస్, టీఎంఎస్ నిరీక్షణ్, ఐఆర్‌సీటీసీ ఎయిర్, పోర్ట్ రీడ్ వంటి అనేక ఇతర యాప్‌లు రైల్వేలో అందుబాటులో ఉన్నాయి.
Also Read: KT Rama Rao: కాంగ్రెస్ అభ్యర్థిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. 'పనికి రాని చెత్త'గా అభివర్ణన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter