Lady Constable Gender Reassignment: మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళా పోలీసు.. పురుషుడిగా లింగ మార్పిడి చేసుకునేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె దరఖాస్తు చేసుకుంది. ఆమె అభ్యర్థనను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. లింగ మార్పిడి అనుమతించింది.
ఆ మహిళా కానిస్టేబుల్ లింగ మార్పిడి చేసుకునేందుకు రాష్ట్ర హోంశాఖ నుంచి అనుమతులు వచ్చినట్లు అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ రాజేష్ రాజోరా వెల్లడించారు. “మహిళ నుంచి పురుషుడిగా మారేందుకు ప్రభుత్వం అనుమతించటం రాష్ట్రంలో ఇదే తొలిసారి.
ఆమె చిన్నతనం నుంచే ఆమె పురుష లక్షణాలను కలిగి ఉన్నట్లు సైకాలజిస్టులు తేల్చారు. ఈ కారణంతో ఆమెను లింగ మార్పిడి చేసుకునేందుకు హోంశాఖ అనుమతులిచ్చింది" అని రాజేష్ రాజోరా పేర్కొన్నారు.
లింగ మార్పిడికి అనుమతి కోసం ఆ మహిళా కానిస్టేబుల్ 2019లో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు దరఖాస్తు పంపింది. ఆ తర్వాత అఫిడవిట్ ఆమె అభ్యర్థనను దాఖలు చేసినట్లు చెప్పారు రాజేశ్ రాజోరా. ఆ దరఖాస్తును రాష్ట్ర హోంశాఖకు పోలీసు హెడ్‌క్వార్టర్ పంపించినట్లు తెలిపారు.
నిబంధనల ప్రకారం భారత పౌరులు తమ కులం, మతానికి సంబంధం లేకుండా తమ సెక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చన్నారు. అందుకు లోబడే లింగ మార్పిడికి అనుమతులు ఇచ్చినట్లు రాజేష్ రాజోరా చెప్పారు.
Also Read: Smartphone For Vaccination: బంపర్ ఆఫర్.. వ్యాక్సిన్ వేయించుకుంటే రూ.60 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ!
Also Read: Arvind Kejriwal: 2022 ఎన్నికలే లక్ష్యం- నేడు పంజాబ్‌కు అర్వింద్ కేజ్రివాల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook