బొలెరో వాహనాన్ని అవలీలగా ఎత్తి పడేసిన మహిళా జవాన్లు ..వీడియో వైరల్ !!

శారీరకంగా  పురుషులతో మహిళలు సమానం కాలేరు అన్న వ్యాఖ్యలు తప్పు అని నాగాలాండ్ మహిళా బెటాలియన్ జవాన్లు నిరూపించారు.

Last Updated : Aug 28, 2019, 04:16 PM IST
బొలెరో వాహనాన్ని అవలీలగా ఎత్తి పడేసిన మహిళా జవాన్లు ..వీడియో వైరల్ !!

నాగా కొండప్రాంతాల్లో ఓ మహీంద్రా బొలేరో వాహనం బురద గుంతలో చిక్కుకుపోయింది.  అదే సమయంలో ఆ మార్గంలో నాగాలాండ్ మహిళా బెటాలియన్ బృందాలు బస్సులో  వెళ్తున్నాయి. కాగా గుంతలో ఇరుక్కున్న వాహనాన్ని చూసి వెంటనే స్పందించారు. బస్సు దిగి వచ్చి తమ సత్తా ఏంటో చూపించారు. గుంతలో ఇరుక్కున్న వాహనాన్ని అవలీలగా ఎత్తి అవతలకు పడేశారు మహిళా జవాన్లు.

కాగా ఈ వీడియోను  నాగాలండ్ ఎమ్మెల్యే మహోన్లునో కికాన్  ట్వీట్ చేయగా..  ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ నాగా మహిళా బెటాలియన్ తో పెట్టుకుంటే అంతే సంగతులు అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

Trending News