MLA Raja singh: ఎమ్మెల్యే రాజాసింగ్, నుపుర్ శర్మల హత్యకు ప్లాన్.. కరుడు గట్టిన ఉగ్రవాది అరెస్టు..

MLA Raja singh: గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్,నుపుర్ శర్మలతో పాటు, సుదర్శన్ టెలివిజన్ చీఫ్ ఎడిటర్ లను చంపడానికి  ప్లాన్ లు చేసిన వ్యక్తిని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో ఎన్నికల వేళ ఒక్కసారిగా తీవ్ర దుమారంగా మారింది. దీనిపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.  

Written by - Inamdar Paresh | Last Updated : May 5, 2024, 12:08 PM IST
  • ఎన్నికల వేళ షాకింగ్ ఘటన..
  • కరుడు గట్టిన ఉగ్రవాదిని పట్టుకున్న పోలీసులు..
MLA Raja singh: ఎమ్మెల్యే రాజాసింగ్, నుపుర్ శర్మల హత్యకు ప్లాన్.. కరుడు గట్టిన ఉగ్రవాది అరెస్టు..

Surat police arrested maulvi sohel abubakr timol:  దేశంలో సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్న వేళ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్ పోలీసులు శనివారం రోజున..  హిందూ సంస్థ నాయకుడు తోపాటు, గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్,నుపుర్ శర్మ, మరో వార్త ఛానెల్ చీఫ్ ఎడిటర్ లను హత్యకు ప్లాన్ చేసిన ఉగ్రవాదిని గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ఇంటెలిజెన్స్ టీమ్ అలర్ట్ గా ఉండటంతో.. ఉగ్రవాదుల ప్లాన్ ప్రస్తుతం బెడిసికొట్టిందని చెప్పుకొవచ్చు. గుజరాత్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు ఆపరేషన్ నిర్వహించారు. సదరు ఉగ్రవాది రహస్యంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతను.. థ్రెడ్ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

Read more: Snake Shed his Skin: బాప్ రే.. కుబుసం విడుస్తున్న పాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

ఈ క్రమంలో గుజరాత్ పోలీసులు మాటువేసి.. మౌల్వీ సోహెల్ అబుబకర్ తిమోల్ (27)ను అరెస్టు చేశారు. ఇతను తన సందేశాలతో ముస్లిం యువతను ఐసీస్,జీహాద్ వైపుకు వెళ్లేలా ప్రసంగాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతగాడు..  సుదర్శన్ టెలివిజన్ ఛానల్ చీఫ్ ఎడిటర్‌తో పాటు బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్, బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్‌లను ఇప్పటికే పలుమార్లు బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే పక్కాసమాచారం మేరకు..  మౌల్వీ సోహెల్ అబుబకర్ తిమోల్ (27) వ్యక్తిని గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం అరెస్టు చేశారు.  ఈ మేరకు సూరత్ పోలీసు కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

హిందూ సనాతన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు ఉపదేశ్ రాణాను హతమార్చేందుకు పాకిస్థాన్‌, నేపాల్‌కు చెందిన వ్యక్తులతో కలిసి కోటి రూపాయల ‘సుపారీ’ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా దీనికోసం ఆయుధాలను  పాకిస్థాన్‌ నుంచి  సేకరించేందుకు అతడు కుట్ర పన్నుతున్నాడని సూరత్ పోలీసు కమిషనర్ గెహ్లాట్‌ తెలిపారు. ప్రస్తుతం నిందితుడి దగ్గర నుంచి ఫోన్ లు, లాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతని మొబైల్ లో అత్యంత రహస్య సమాచారం కూడా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఉపదేశ్ రాణా హత్యకు కోటి రూపాయలు ఆఫర్ చేయడంతో సహా, మరికొందరిని హత్య చేసేందుకు కూడా స్కెచ్ లు రెడీ చేస్తున్నట్లు గుర్తించారు.  దీని కోసం, అతను పాకిస్తాన్,  నేపాల్‌కు చెందిన స్లిపర్ సెల్స్ తో ఇతను  నిరంతరం టచ్‌లో ఉంటున్నట్లు కమిషనర్ గెహ్లాట్  మీడియా సమావేశంలో వెల్లడించారు.

Read more: Agra school Principal: వామ్మో.. లేడీ టీచర్ కు చుక్కలు చూపించిన ప్రిన్సిపాల్.. బట్టలు చింపేసి పిడిగుద్దులు.. వీడియో వైరల్..

ఈ ఏడాది మార్చిలో రాణాకు గతంలో బెదిరింపులు టిమోల్ బెదిరింపులకు పాల్పడ్డాడు.  నిందితుడు తన గ్రూప్ కాల్‌లో పాకిస్తాన్, నేపాల్ నుండి నంబర్‌లను కనెక్ట్ చేయడం ద్వారా లక్ష్యానికి బెదిరింపులకు లావోస్ నుండి వర్చువల్ నంబర్‌ను ఉపయోగించాడని  పోలీసులు గుర్తించారు. అతని ఫోన్ నంబర్‌లో దొరికిన ఫోటోలను పోలీసులు గుర్తించారు. దీనిలో.. సుదర్శన్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ సురేశ్ చవాన్కే, రాజకీయ నాయకుడు నూపుర్ శర్మ , హైదరాబాద్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ల ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎన్నికల ముందు ఈ ఘటన మాత్రం పెను సంచలనంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x