కశ్మీర్ పై భారత్ చర్యతో పాక్ గుండెల్లో గుబులు !!

కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాక్ సర్కార్ కు షాక్ కు గురి చేసింది  

Last Updated : Aug 6, 2019, 12:22 PM IST
కశ్మీర్ పై భారత్ చర్యతో పాక్  గుండెల్లో గుబులు !!

కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటి వరకు స్వయంప్రతిపత్తిని ఆసరాగా తీసుకొని వేర్పాటు వాదులతో కుమ్మకై కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్ సర్కార్...ఇక మీదట తమ ఆటలు సాగవనే విషయాన్ని గ్రహించినట్లుంది. అందుకే కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాలపై విషం కక్కుతోంది.

ఖండించిన ఇమ్రాన్ సర్కార్ !!
జమ్ము కాశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 ని రద్దు చేయడం.. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం లాంటి భారత ప్రభుత్వ నిర్ణయాలను పాకిస్థాన్ వ్యతిరేకిస్తోంది.కాశ్మీర్ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా భారత్‌ వ్యవహరిస్తోందని ఇమ్రాన్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జమ్ము కాశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనైతికం, చట్ట వ్యతిరేకమని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ ఓ ప్రకటన ద్వారా విమర్శించింది.

ఐరాసా జోక్యం చేసుకోవాలి !!
కశ్మీర్ విషయంలో భారత్‌ నిర్ణయంపై కౌంటర్‌ కు సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలిస్తామని ఇమ్రాన్ సర్కార్  తెలిపింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వివాదాస్పద ప్రదేశం కాశ్మీర్‌ అని... ఈ విషయంపై ఐక్య రాజ్య సమితి కలగజేసుకోవాలని కోరింది. మరోవైపు పాకిస్థాన్‌ లోని భారత రాయబార కార్యాలయానికి ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేస్తూ నిరసన వ్యక్తం చేసింది. ఇది చాలదన్నట్లు  కశ్మీర్ విషయంలో చర్చించేందుకు ఇమ్రాన్ సర్కార్ ఈ రోజు  పార్లమెంటు అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేస్తోంది.

పాక్ అతి జోక్యం !
కశ్మీరీల హక్కుల విషయంలో స్పందించేందుకు  ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. మోడీ సర్కార్ నిర్ణయంలోని లోపాలను ఎత్తిచూపుతున్న విపక్షాలు... సభ లోపల బయట మోడీ సర్కార్ ను ఎండగడుతున్నాయి. మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో  కశ్మీరీల హక్కులను భంగం వాటిల్లితే ఉద్యమ మాట పట్టేందుకు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఎలాగూ ఉన్నాయి. అయితే పొరుగు దేశమైన పాక్.. ఈ స్థాయిలో భారత ప్రభుత్వంపై  విరుచుకుపడటం ఏంటని సగటు భారతీయులు ప్రశ్నిస్తున్నారు.  కవ్వింపు చర్యలకు అడ్డుగా మారిందనే కారణంతోనే పాక్ ఇలా ఎగిరి గంతులేస్తుంది తప్పితే కశ్మీర్ ప్రజలపై ప్రేమతో కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కశ్మీరీలపై పాక్ చూపిస్తున్నది ... సవతి తల్లి ప్రేమ తప్పితే మరేం కాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

 

 

Trending News