Rajinikanth's health updates: రజనీకాంత్ అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని (Rajinikanth hospitalised) నిపుణులైన వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు.. తలైవా ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై (Rajinikanth health conidtion) అపోలో ఆసుపత్రి వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. నిన్నటికంటే.. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని (health health bulletin) బులెటిన్‌లో పేర్కొన్నారు. రజనీకాంత్‌కు ఈ రోజు మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని.. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ సాయంత్రం వరకు వస్తాయని అపోలో (Apollo) వైద్యులు తెలిపారు. Also Read: Vikarabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
Latest Medical bulletin about #SuperStar @rajinikanth health pic.twitter.com/AdWQNW1vtu
— Ramesh Bala (@rameshlaus) December 26, 2020
ప్రస్తుతం రక్తపోటు హెచ్చుతగ్గులకు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. రజనీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని.. కావున ఆసుపత్రి వద్దకు ఎవరూ కూడా రావొద్దంటూ అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. Also read : Rajinikanth in hospital : రజినీకాంత్‌కు అస్వస్థత, అపోలో ఆసుపత్రిలో చేరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook