Railway Jobs 2023: రైల్వేలో భారీగా ఉద్యోగాలు, ఇవాళే ఆఖరు తేదీ, వెంటనే అప్లై చేయండి

Railway Jobs 2023: నిరుద్యోగులకు శుభవార్త. దక్షిణ తూర్పు మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం పదవ తరగతి విద్యార్హత ఉంటే చాలు..ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 5, 2023, 09:23 PM IST
Railway Jobs 2023: రైల్వేలో భారీగా ఉద్యోగాలు, ఇవాళే ఆఖరు తేదీ, వెంటనే అప్లై చేయండి

Railway Jobs 2023: దక్షిణ తూర్పు మధ్య రైల్వేలో భారీగా అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్ధులు వెంటనే అప్లై చేసుకోకపోతే మంచి అవకాశం కోల్పోతారు. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఇవాళే చివరి తేదీ.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో పెద్దఎత్తువ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగనుంది. దీనికి సంబంధించిన నోటీఫికేషన్ ఇప్పటికే వెలువడింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 548 వేకెన్సీలను భర్తీ చేయనున్నారు. మే 3వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ అంటే జూన్ 3 దరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీ. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశముండటంతో ఇవాళ రాత్రి లోగా ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం 548 ఖాళీలుంటే..అందులో కార్పెంటర్, డ్రాఫ్ట్స్‌మెన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మిషనిస్ట్, పెయింటర్, ప్లంబర్, షీట్ మెటల్ వర్క్స్, హిందీ- ఆంగ్ల భాషల్లో స్టెనో, వెల్డర్, వైర్‌మెన్, డిజిటల్ ఫోటోగ్రాఫర్ వంటి ఖాళీలున్నాయి. 1వ తేదీ జూలై 2023 నాటికి 15-24 ఏళ్ల మధ్యలో వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల వారికి నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంది. 

Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈసారి డీఏ ఎంత పెరగనుందంటే..?

రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాలకు కావల్సిన కనీస విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణత. దీంతోపాటు ఏదైనా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఎన్సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉంటే చాలు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్ధులు ఈ లింక్ https://www.apprenticeshipindia.gov.in/candidate-login ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఇవాళ రాత్రి 12 గంటలలోపు అప్లై చేసుకుంటేనే మీ దరఖాస్తు చెల్లుతుంది. పదవ తరగతి లేదా ఐటీఐ లేదా ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఏదైనా గుర్తింపు కలిగిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి ఉండాలి. ఇవి పూర్తిగా టెక్నికల్ ఉద్యాగాలు. జీతభత్యాలు, ఏ రిజర్వేషన్ కేటగరీకు వయో పరిమితి మినహాయింపు ఎంత అనేది వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Also read: India China Border Clash: చైనా గుట్టురట్టు.. LAC వద్ద రహస్యంగా దళాల విస్తరణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News