మళ్లీ మిడతల దండు..!!

ఆకాశంలో మళ్లీ మిడతల దండు.! అవును.. మరోసారి మిడతల దండు పంటలపై దాడి చేసింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ సిర్మండి గ్రామంలో పంటలపై మూకుమ్మడిగా వచ్చిన మిడతలు విరుచుకుపడ్డాయి.

Last Updated : May 10, 2020, 09:04 AM IST
మళ్లీ మిడతల దండు..!!

ఆకాశంలో మళ్లీ మిడతల దండు..!!
రాజస్థాన్ జోధ్‌పూర్‌లో పంటలపై దాడి..!!
పంటలు సర్వనాశనం
లబోదిబోమంటున్న రైతులు 
చర్యలు ప్రారంభించిన రాజస్థాన్ ప్రభుత్వం
 

ఆకాశంలో మళ్లీ మిడతల దండు.! అవును.. మరోసారి మిడతల దండు పంటలపై దాడి చేసింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ సిర్మండి గ్రామంలో పంటలపై మూకుమ్మడిగా వచ్చిన మిడతలు విరుచుకుపడ్డాయి.

ఈ దెబ్బతో పంటలు నాశనం అయ్యాయి. మిడతల ధాటికి ఉల్లి, జొన్న, గోధుమ పంటలు నాశనం అయ్యాయమని రైతులు చెబుతున్నారు. దిగుబటి వచ్చే సమాయానికి మిడతలు దాడి చేసిన కారణంగా పంటలు చేతికి రాలేదని రైతులు లబోదిబోమంటున్నారు. రాజస్థాన్ లోని జైసల్మీర్, బర్మెర్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా పంటలపై దాడికి దిగాయి మిడతలు. ఐతే వీటి దాడి నుంచి ఎలా తప్పించుకోవాలనే దానిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్కడక్కడా మిడతల దండును చెదరగొట్టడానికి రైతులు పొగ పెడుతున్నారు. మిడతలను హతం చేసేందుకు సరైన పురుగు మందు స్ప్రే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు మిడతల దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సత్వరమే చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ ఉన్నతాధికారులను ఆదేశించారు. 

రాజస్థాన్ లో మిడతల దండు దాడి చేయడం ఇది మూడో సారి కావడం విశేషం. సంవత్సరంలోగానే మూడు సార్లు దాడులు చేశాయి. దీంతో ఇప్పటి వరకు రాజస్థాన్ లో రైతులు వేసిన ఏ పంట కూడా చేతికి రాకుండా పోయింది. ఫలితంగా ఈ ఏడాదంతా నష్టాలు మూటగట్టుకున్నారు అన్నదాతలు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News