Blackheads: ముక్కుపై బ్లాక్ హెడ్స్ ఒక్క రోజులో మాయం అవ్వాలంటే…ఈ బెస్ట్ టిప్స్ మీకోసం!

Nose Blackheads Removal Tips: బ్లాక్‌హెడ్స్ అనేవి చర్మంపై చిన్న చిన్న నల్లటి మచ్చలుగా కనిపిస్తాయి. ఇవి ముఖంపై, ముక్కు, నుదిటి, గడ్డం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే బ్లాక్‌ హెడ్స్‌ తొలగించడంలో కొన్ని చిట్కాలు ఎంతో సహాయపడుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2024, 12:54 PM IST
Blackheads: ముక్కుపై బ్లాక్ హెడ్స్ ఒక్క రోజులో మాయం అవ్వాలంటే…ఈ బెస్ట్ టిప్స్ మీకోసం!

Nose Blackheads Removal Tips: ముఖ సౌందర్యానికి ముప్పుగా నిలిచే బ్లాక్‌హెడ్స్ చాలా మందిని వేధించే సమస్యగా మారింది ఈ బ్లాక్‌ హెడ్స్‌ అనేది సెబాషియస్ అనే గ్రంథులు అధికంగా సెబమ్ అనే నూనె పదార్థాన్ని విడుదల చేయడం వల్ల ఏర్పడతాయి. చర్మ రంగుకు కారణమయ్యే మెలనిన్ అనే వర్ణద్రవ్యం కూడా ఎక్కువగా ఉంటే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే బాధపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు చర్మనిపుణులు  సకాలంలో సరైన చికిత్స తీసుకుంటే బ్లాక్‌హెడ్స్ నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. మీ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అసలు బ్లాక్‌ హెడ్స్‌ ఏర్పడానికి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం.

సెబాషియస్ గ్రంథులు అధికంగా సెబమ్ అనే నూనె పదార్థాన్ని ఉత్పత్తి చేయడం కారణంగా బ్లాక్‌హెడ్స్‌కు దారితీస్తుంది.అలాగే యుక్తవయస్సులో హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, వారసత్వం వంటి అంశాలు సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి.చర్మంపై మృతకణాలు పేరుకుపోవడం వల్ల కూడా చర్మ రంధ్రాలు మూసుకుపోయి బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి. సరైన చర్మ సంరక్షణ పద్ధతులు పాటించకపోవడం, చర్మాన్ని రోజుకు రెండుసార్లు శుభ్రం చేయకపోవడం వల్ల మృతకణాలు పేరుకుపోతాయి. చర్మ రంధ్రాలు చిన్నగా ఉంటే, సెబమ్ సులభంగా బయటకు రాకుండా చిక్కుకుపోయి బ్లాక్‌హెడ్స్‌కు దారితీస్తుంది. కొన్ని స్టెరాయిడ్స్, యాంటీడిప్రెసెంట్స్ వంటి మందులు సెబమ్ ఉత్పత్తిని పెంచి బ్లాక్‌హెడ్స్‌కు దారితీస్తాయి. ఆయిల్-ఆధారిత క్లెన్సర్లు, మాయిశ్చరైజర్లు వంటి తప్పుడు చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడటం వల్ల బ్లాక్‌హెడ్స్ రావచ్చు.

అయితే కొన్ని చిట్కాలను ఉపయోగించి ఈ బ్లాక్‌ హెడ్స్‌కు చెక్‌ పెట్టవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి చికిత్స తీసుకోవడం వల్ల అందాన్ని కాపాడుకోవచ్చు అనేది తెలుసుకుందాం.

గంధపు చెక్క రోజ్ వాటర్ :

 బ్లాక్ హెడ్స్ తొలగించడంలో గంధపు చెక్క అలాగే రోస్ వాటర్ ఎంతో ప్రభావితంగా పనిచేస్తుంది. ముందుగా గంధపు చెక్క పొడిలో రోజ్ వాటర్ కలుపుకొని దాన్ని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం పై ఫేస్ ప్యాక్‌ వేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయడం వల్ల బ్లాక్ హెడ్స్  తొలగించబడతాయి.

 బేకింగ్ సోడా: 

బ్లాక్ హెడ్ సమస్య ఉన్నవారు 4 టేబుల్ స్పూన్  బాకీంగ్ సోడా, టీ స్పూన్ డెక్సి సాల్ట్, రెండు స్పూన్ల నీళ్లు కలుపుకొని దీన్ని చర్మంపై బ్లాక్ హెడ్స్ ఉన్నచోట రుద్దకుంటే మంచి ఫలితం పొందుతారు.

 ఓట్ మిల్క్ పౌడర్ రోజ్ వాటర్ :

 ఓట్ మిల్ పౌడర్ కు రోజు వాటర్ కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీని 15 నిమిషాల పాటు చర్మం పైన ఫేస్ ప్యాక్ లా వేసుకొని చల్లని నీటితో కడిగేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

 ముల్తాని మట్టి :
 
సునీతమైన చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టి రోజ్ వాటర్ కలుపుకొని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట ఈ మాస్క్ ను అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

 మెంతి ఆకుల పేస్ట్ :

మెంతి ఆకుల పేస్ట్ చర్మం పైన రాసుకొని 15 నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయడం వల్ల బ్లాక్ హెడ్స్ అనేవి కనిపించవు.

 పెరుగు నల్ల మిరియాలు :

 పెరుగులో నల్ల మిరియాల పొడి వేసి బాగా కలిపి దాని ముఖానికి రాసుకోవాలి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 కొత్తిమీర ఆకులు రసం :

 కోతిమీర ఆకుల నుంచి తీసిన రసాన్ని ఒక టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ వేసి కలుపుకొని ఉదయం లేచిన వెంటనే శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News