Joint Pain: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా 7 రోజుల్లో కీళ్లనొప్పుల సమస్యలకు చెక్‌..

Home Remedies for Joint Pain: ఆధునిక జీవనశైలి కారణంగా శీతాకాలంలో చాలామంది యువత కీళ్లనొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన సలహాలు, చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2022, 09:48 AM IST
Joint Pain: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా 7 రోజుల్లో  కీళ్లనొప్పుల సమస్యలకు చెక్‌..

Home Remedies for Joint Pain: శీతాకాలంలో కీళ్ల నొప్పులు రావడం సర్వసాధారణం. అయితే ఈ సమస్యలు 60 నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్న వారికి వస్తూ ఉంటాయి. అని ఆశ్చర్యం ఏమిటంటే యువతలో కూడా ఈ కీళ్ల నొప్పులు వస్తున్నాయని ఇటీవలే నివేదికలు పేర్కొన్నాయి. ఆధునిక జీవనశాలిని అనుసరించడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలను సలహాలను పాటించాల్సి ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో నిపుణులు సూచించిన హోం రెమెడీస్ ను పాటించడం వల్ల సులభంగా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.  

శీతాకాలంలో కీళ్ల నొప్పులకు హోం రెమెడీస్:

యాంటీ ఆక్సిడెంట్ డైట్:
కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు శీతాకాలంలో తప్పకుండా మీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీనికోసం ప్రతిరోజు  ఆలివ్ నూనెతో తయారుచేసిన ఆహారాలు, చేపలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల శరీరానికి విటమిన్ డి లభించి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

వ్యాయామాలు తప్పనిసరి:
తప్పనిసరిగా వ్యాయామాలు ప్రతిరోజూ చేయాల్సి ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు శీతాకాలంలో వ్యాయామాలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. నిపుణులు సూచించిన పలు రకాల వ్యాయామాలతో కీళ్ళ నొప్పులు తగ్గడమే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా చలికాలంలో ఇలా వ్యాయామాలు చేయడం వల్ల బాడీ కూడా ఫిట్ గా మారుతుంది.

శరీరాన్ని ఎప్పుడు వెచ్చగా ఉంచుకోండి:
కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు చలికాలంలో శరీరాన్ని ఎప్పుడు వెచ్చగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చలినీళ్ళతో స్నానాలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా ఉంటేనే కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. కాబట్టి కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా చలికాలంలో శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది.

Also Read : Ram Charan Video Call : గుడ్ న్యూస్ చెప్పబోతోన్న ప్రభాస్!.. లీక్ చేసిన రామ్ చరణ్‌

Also Read : Anasuya Bharadwaj White Dress : బొడ్డు చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. తెలుపు దుస్తుల్లో అనసూయ అందాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News