Headache Home Remedy: అమ్మమ్మ చిట్కాలతో తలనొప్పి 5 నిమిషాల్లో మటు మాయం..

Instant Home Remedies For Headache: తరచుగా తీవ్ర తలనొప్పులతో బాధపడుతున్న ప్రతిరోజు అమ్మమ్మ అందించిన ఈ చిట్కాలను వినియోగిస్తే సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సాధారణ రెసిపీతో దీర్ఘకాలిక వ్యాధులు సైతం దూరమవుతాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 3, 2023, 11:58 AM IST
Headache Home Remedy: అమ్మమ్మ చిట్కాలతో తలనొప్పి 5 నిమిషాల్లో మటు మాయం..

 

Instant Home Remedies For Headache: తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్య. వాతావరణం మారడం, ఒత్తిడి కారణంగా తీవ్ర తలనొప్పి సమస్యలు వస్తూ ఉంటాయి. భారతదేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. ఈ కారణంగా వాతావరణంలో తేమ పరిమాణాలు పెరిగి.. తీవ్ర ఇన్ఫెక్షన్లకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో దీని కారణంగా కూడా తీవ్ర తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తరచుగా రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ వినియోగించకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన సలహాలు సూచనలు పాటించడం చాలా మంచిది.  

తలనొప్పి ఎందుకు వస్తుంది? 
వర్షం తర్వాత గాలిలో తేమ పెరుగుతుంది. దీనికి కారణంగా శరీరం డిహైడ్రేషన్కు గురవుతుంది. దీంతో శరీరం నుంచి చెమట ఎక్కువగా బయటకు వచ్చి కొందరిలో తలనొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో జుట్టు గట్టిగా కట్టుకోవడం కారణంగా కూడా తలనొప్పి సమస్యలు రావచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇలాంటి నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా

తరచుగా తీవ్రతల నొప్పి సమస్యలతో బాధపడుతున్న వారు చల్లటి నీటితో తలస్నానం చేసి బట్టలు మార్చుకోండి. అంతేకాకుండా మీ హెయిర్ కి నూనెను అప్లై చేసి 20 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల తలకు విశ్రాంతి లభించి.. తలనొప్పి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం చాలామంది స్మార్ట్ ఫోన్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు తలనొప్పితో బాధపడే క్రమంలో వీటికి దూరంగా ఉంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.

ఈ రెసిపీని ఫాలో అవ్వండి:
తలనొప్పితో బాధపడేవారు ముందుగా కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని బాగా శుభ్రం చేసి నీటిలో వేయండి ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనెను వేసి.. సిలిండర్ పై మరిగించాలి. మరిగించిన తర్వాత సర్వ్ చేసుకుని తాగితే తలనొప్పి కేవలం ఐదు నిమిషాల్లో దూరమవుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News