/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

 

Maida Side Effects: సమోసా నుంచి మొదలుకొని నూడిల్స్ దాకా ఇప్పుడున్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారు. ఎందుకంటే ఇవి నోటికి మంచి రుచిని కలిగిస్తాయి. వీటిని శుద్ధి చేసిన మైదా పిండితో తయారు చేస్తారు. కాబట్టి ఎంతో రుచిగా మంచి రంగును కలిగి ఉంటాయి. అయితే ఈ పిండితో తయారు చేసిన ఆహార ప్రతి రోజు తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ తెల్ల పిండిని ఎక్కువగా శుద్ధి చేసి తయారు చేస్తారు. అంతేకాకుండా ఇదే క్రమంలో కొన్ని హానికరమైన రసాయనాలు కూడా మిక్స్‌ చేస్తారు. అందుకే ఈ తెల్ల పిండిని కొందరు వైద్య నిపుణులు వైట్ పాయిజన్ అని పిలుస్తారు. తరచుగా ఈ పిండితో తయారు చేసిన ఆహారాలు తినేవారిలోనే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఇటీవలే పరిశోధనలు కూడా తెలిపాయి. 

ఈ తెల్ల పిండిని భారతీయులకు ఇటాలియన్లు తొలిసారిగా పరిచయం చేశారు. ఈ పిండిని గోధుమల నుంచి తయారు చేసినప్పటికీ ఎక్కువగా ఫిల్టర్‌ చేసి, రసాయనాలు కలుపుతారని సమాచారం. అయితే 5,000 ఏళ్ల క్రితం ఈజిప్టులో మైదా పిండిని మొదటిసారిగా తయారు చేశారు. అక్కడి ప్రజలు ఈ పిండిని తయారు చేసేందుకు అనేక విధాలు కష్టపడ్డారు. వారు ముందుగా A1 క్వాలిటీ గోధుమలు తీసుకుని వాటిని పిండిలా తయారు చేసి..బాగా శుద్ధి చేసేవారట. ఇలా తయారు చేయడానికి దాదాపు 10 నుంచి 14 రోజుల పాటు సమయం పట్టేదని సమచారం. అయితే ఈ పిండిని ఎక్కువగా ఈజిప్టు రాజు భోజనం తయారికి వినియోగించేవారు. ఈ తెల్ల పిండితో అప్పట్లో ఎన్నో వంటకాలు చేసేవారట. అయితే క్రమంలో ఈ పిండిని ప్రజలు కూడా తయారు చేసుకోవడం మొదలు పెట్టడంతో..అందరికీ అందుబాటులోకి వచ్చింది. 

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

మైదాను తయారు చేయడానికి అందరు రెండు పద్ధతులు పాటిస్తారు. మొదటగా గోధుమలను పిండిలా తయారు చేసి దానిని ప్రాసెస్ చేస్తారు. ఇలా కొన్ని రోజుల పాటు ప్రాసెస్‌ చేసి బెంజాయిల్ పెరాక్సైడ్ అనే రసాయనాన్ని కలుపుతారు.  అంతేకాకుండా ఈ పిండిలో అలోక్సాన్ రసాయాన్ని కూడా మిక్స్‌ చేస్తారు. ఈ రెండు రసాయనాలను కలపడం వల్ల మైదా చివరి దశకు చేరుకుంటుంది. అయితే ఈ రెండు రసాయనాలను ఎక్కువగా హెయిర్ డైలలో వినియోగిస్తూ ఉంటారు. ఇలా వీటన్నింటితో తయారు చేసిన తెల్ల పిండిని ప్రతి రోజు ఆహారాల్లో తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతకంగానూ మరే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

ప్రతి రోజు మైదా తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఇందులో బాడీకి కావాల్సిన పోషకాలు, విటమిన్స్‌ ఏవి ఉండవు..కాబట్టి వీటితో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల ఎలాంటి యూజ్‌ ఉండదు. అంతేకాకుండా గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఈ తెల్ల పిండి ప్రతి రోజు తింటే రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

 అయితే ఈ పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలకు ప్రతి రోజు పిల్లలకు ఆహారంగా ఇవ్వడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల వస్తాయి. అంతేకాకుండా మెదడుపై చెడు ప్రభావం పడి ఆలోచన సమర్థ్యం, జ్ఞాపకశక్తి తగ్గి పోయే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పెద్దవారిలో అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తెల్ల పిండితో తయారు చేసిన ఆహారాలు తినకపోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Maida Side Effects: Why maida flour foods are dangerous for children What are the reasons why this flour is called white poison
News Source: 
Home Title: 

Maida Side Effects: మైదా పిండి ఆహారాలు పిల్లలకు ఎందుకు ప్రమాదం..ఈ పిండిని తెల్లటి విషం అనడానికి కారణాలేంటి?

Maida Side Effects: మైదా పిండి ఆహారాలు పిల్లలకు ఎందుకు ప్రమాదం..ఈ పిండిని తెల్లటి విషం అనడానికి కారణాలేంటి?
Caption: 
source file: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
మైదా పిండి ఆహారాలు పిల్లలకు ఎందుకు ప్రమాదం..ఈ పిండిని తెల్లటి విషం అనడానికి కారణాలు!
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Sunday, August 13, 2023 - 12:07
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
48
Is Breaking News: 
No
Word Count: 
412