Orange Face Masks: విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ పండ్లు శరీరానికి చాలా రకాలుగా ఉపయోపడతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రభావవంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి నారింజ రసం తాగమని ఆరోగ్య నిపుణుల సూచిస్తారు. ఇందులో ఉండే మూలకాలు ముఖంపై మచ్చలు, మృతకణాలు, మొటిమలను తొలగించడానికి ప్రభావవంతంగా పని చేస్తాయి. కాబట్టి మీరు ముఖంపై చర్మ సమస్యలతో బాధపడితే ఇలా చేయండి.
గ్లోయింగ్ స్కిన్ కోసం ఆరెంజ్ ఫేస్ ప్యాక్:
నారింజ, అరటి ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి అరటిపండు, ఒక నారింజ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన మిశ్రమాన్ని ముఖాని అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి శుభ్రం చేసుకోవాలి ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై అనారోగ్య సమస్యలు సులభంగా తగ్గుతాయి.
శనగ పిండి, నారింజ ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ ముఖం pH విలువలను సమతుల్యం చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా దీనిని ముఖంపై అప్లై చేస్తే సులభంగా ముఖంపై మచ్చలు అన్ని రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ముఖంపై చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
కొబ్బరి నూనె, నారింజ ఫేస్ ప్యాక్:
ఒక చెంచా కొబ్బరి నూనెలో ఒక నారింజ పండు గుజ్జును వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్స్‌ను క్రమం తప్పకుండా వినియోగిస్తే చలికాలంలో వచ్చే చర్మ సమస్యలు సులభంగా తగ్గుతాయి.
పసుపు, నారింజ ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా..నారింజ తొక్కను ఎండలో ఆరబెట్టి మెత్తగా పౌడర్‌గా చేసుకోవాలి. తర్వాత 1 టీస్పూన్ ఆరెంజ్ పౌడర్‌లో చిటికెడు పసుపు కలపండి. ఇలా తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లో రోజ్ వాటర్ వేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల ఉంచి కడిగేయండి. ఇలా క్రమం తప్పకుండా ప్రతి రోజూ చేస్తే సులభంగా చర్మ సమస్యలు తగ్గుతాయి.
Also Read : Matti Kusthi : మొదటి పెళ్లి అందుకే చెడింది.. గుత్తా జ్వాలాకు 24 గంటలు అదే పని.. విష్ణు విశాల్ కామెంట్స్
Also Read : Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook