How To Prepare Potlakaya Perugu Pachadi: పొట్లకాయ పచ్చడి ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆంధ్ర ప్రాచీన వంటకం. చాలా మంది దీనిని వేసవి కాలంలో ఎక్కువగా ఆహారాల్లో తీసుకుంటారు. దీనిని తెలంగాణాలోని కొన్ని పల్లె ప్రాంతాల్లో పెరుగుతో తయారు చేసుకుంటే, ఆంధ్రాల్లో కొన్ని ప్రాంతాల్లో పాలను వినియోగించి తయారు చేసుకుంటారు. ఈ పొట్లకాయలతో చాలా మంది నిల్వపచ్చడ్లు కూడా తయారు చేసుకుంటారు. వివిధ రకాల మసాలను వినియోగించి ఈ పచ్చడిని తయారు చేసుకుని వేడి వేడి అన్నంలోకి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి పొందుతారు. అయితే పొట్లకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పొట్లకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
పొట్లకాయ - 1
పెరుగు - 1 కప్పు
ఉల్లిపాయ - 1/2 (తరిగినది)
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు (తరిగిన)
పచ్చిమిరపకాయలు - 2-3 (తరిగినవి)
ఇంగువ - 1/4 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 2
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
1. ముందుగా పొట్లకాయను తీసుకుని బాగా తురుముకోవాల్సి ఉంటుంది.
2. ఒక గిన్నెలో పెరుగు, తురిమిన పొట్లకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఇలా మిక్స్ చేసిన అన్నింటి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాల్సి ఉంటుంది.
ఒక చిన్న పాన్‌లో నూనె వేడి చేసి ఇంగువ, జీలకర్ర వేసి బాగా వేయించాలి.
4. ఆ తర్వాత అందులోనే ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి తయారీ చేసిన పెరుగు పచ్చడిలో కలపాలి.
5. ఇలా అన్ని మిక్స్ చేసిన తర్వాత అన్నంలో వడ్డించుకుని తినొచ్చు.
చిట్కాలు:
* పొట్లకాయ పచ్చడికి మరింత రుచి రావాలంటే, తురిమిన పొట్లకాయను కొద్దిగా ఉప్పు వేసి 10 నిమిషాలు నానబెట్టి, ముక్కలను పిండి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
* అలాగే ఇందులో కొత్తిమీరకు బదులుగా, మీరు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు.
పొట్లకాయ పచ్చడి ప్రయోజనాలు:
పొట్లకాయ పోషకాల సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
పొట్లకాయ పచ్చడి ప్రతి రోజు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది.
ఇది రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.
ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి