చిత్ర మాలిక: దేశానికి ప్రధానులైన క్రికెటర్లు వీళ్లే

  • Aug 13, 2018, 16:53 PM IST
1 /4

ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్‌కు ప్రధానమంత్రి అయిన తొలి క్రికెటర్ కాదు. అంతకు ముందు ప్రధానిగా సేవలందించిన నవాజ్ షరీఫ్ కూడా క్రికెటరే. క్లబ్ క్రికెటరైన నవాజ్.. ఒక్క ఫస్ట్ క్లాస్ క్రికెట్ మాత్రమే ఆడారు. అదే చివరి మ్యాచ్ కూడా.

2 /4

ఫస్ట్ క్లాస్ క్రికెటరైన సర్ అలెక్ డగ్లస్-హోమ్ బ్రిటన్ ప్రధానిగా సేవలందించారు. మిడిల్ సెక్స్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల తరఫున 10 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు. యూకే ప్రధానిగా అక్టోబర్ 1963- అక్టోబర్ 1964 వరకు బాధ్యతలు నిర్వహించారు. 1966లో ఎంసీసీ అధ్యక్షుడయ్యారు.

3 /4

సర్ ఫ్రాన్సిస్ బెల్ న్యూజిలాండ్‌లో జన్మించి పదవి చేపట్టిన తొలి ప్రధాన మంత్రి. 1925వ సంవత్సరం మే 10-30 వరకు ప్రధాన మంత్రిగా 20 రోజులు పనిచేశారు. 1870లో రెండు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులను విల్లింగ్స్టన్‌లో ఆడారు. విలియం మెస్సీ మరణానంతరం తాత్కాలిక ప్రధానిగా ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టారు.

4 /4

కమిసేస్ మారా, ఫిజీ దేశ ఆధునిక చరిత్రలో ప్రసిద్ధి చెందినవారు. బ్రిటీషు ప్రభుత్వం నుండి స్వాతంత్య్రం పొందాక ప్రధానిగా 21 సంవత్సరాలు, దేశాధ్యక్షుడిగా 7 సంవత్సరాలు పనిచేశారు. 1953/54లో ఫిజీ దేశం తరఫున  రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. వైస్-కెప్టెన్‌గా పనిచేశారు.