Naga Chaitanya: సమంత, శోభిత ఇద్దరు భార్యలతో నాగచైతన్య నటించిన సినిమా ఏదో తెలుసా?

Naga Chaitanya Sobitha Dhulipala And Samantha Acted In One Movie: సమంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో సమంత నాగచైతన్య కలిసి సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే శోభిత, సమంతతో కలిసి చైతూ ఒక సినిమా చేశాడు. ఆ సినిమా ఏమిటో తెలుసా?

1 /9

సమంత, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వీరు ముగ్గురు సినిమాకు సంబంధించినవారే. వీరు ముగ్గురు కలిసి ఒక సినిమాలో నటించారనే వార్త వైరల్‌గా మారింది.

2 /9

సినిమాల ద్వారా పరిచయమైన సమంతను కొన్నేళ్లు ప్రేమించిన అక్కినేని నాగచైతన్య తర్వాత వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

3 /9

ఎంతో ప్రేమగా ఏకమైన ఆ జంట కాపురం నాలుగేళ్లు కూడా కొనసాగలేదు. సమంతతో విడాకుల అనంతరం చైతూ శోభితను వివాహం చేసుకున్నాడు.

4 /9

సినిమాల్లో సమంతతోపాటు శోభితతో కలిసి నాగచైతన్య నటించాడు. వీరు ముగ్గురు కలిసి ఒక సినిమా చేశారు.

5 /9

చైతూ, సమంత భార్యాభర్తలుగా నటించిన సినిమా 'మజిలీ'. ఈ సినిమాలో శోభిత కూడా నటించింది.

6 /9

మజిలీ సినిమాలో సమంత ప్రధాన హీరోయిన్‌గా నటించగా.. శోభితను సహ నటిగా చిత్రబృందం తీసుకున్నారట.

7 /9

సినిమాలోని కొన్ని సీన్లు శోభితతో చిత్రీకరించారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా మజిలీ సినిమా నుంచి శోభిత తప్పుకుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

8 /9

శోభిత తప్పుకోవడంతో మజిలీ సినిమాలో దివ్యాంక కౌశిక్‌ నటించారు. లేకపోయి ఉంటే ఇద్దరు భార్యలతో చైతూ నటించిన సినిమాగా 'మజిలీ' గుర్తింపు పొంది ఉండేది.

9 /9

సమంత, నాగచైతన్య నటించిన మజిలీ సినిమా వారిద్దరి కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. చైతూ కెరీర్‌లో ఈ సినిమా భారీ హిట్‌గా నిలిచింది.