Controversy Queens: జీవితమంతా వివాదాలతోనే గడిపిన బాలీవుడ్ భామలు, నాటి పర్వీన్ బాబి నుంచి రాఖీ వరకూ అందరిదీ అదే దారి

అదేంటో గానీ ప్రపంచంలో ఎక్కడా లేనన్ని వివాదాస్పద ఘటనలు బాలీవుడ్‌లోనే కన్పిస్తుంటాయి. బహుశా అందుకే బాలీవుడ్‌కు కాంట్రోవర్శకు మధ్య సంబంధముందంటారు. నటీమణులు ఈ వివాదాల్నించి మినహాయింపు కానేకాదు. 70వ దశకం నుంచి ఇవాళ్టి వరకూ అందరిదీ అదే తీరు. అదే వైఖరి. ప్రతి ఒక్కరికీ ఒక్కో వివాదాస్పద జీవితం. జీవితమంతా వివాదాస్పద అంశాలే.

Controversy Queens: అదేంటో గానీ ప్రపంచంలో ఎక్కడా లేనన్ని వివాదాస్పద ఘటనలు బాలీవుడ్‌లోనే కన్పిస్తుంటాయి. బహుశా అందుకే బాలీవుడ్‌కు కాంట్రోవర్శకు మధ్య సంబంధముందంటారు. నటీమణులు ఈ వివాదాల్నించి మినహాయింపు కానేకాదు. 70వ దశకం నుంచి ఇవాళ్టి వరకూ అందరిదీ అదే తీరు. అదే వైఖరి. ప్రతి ఒక్కరికీ ఒక్కో వివాదాస్పద జీవితం. జీవితమంతా వివాదాస్పద అంశాలే.

1 /5

నాటి తరం మేటి నటి ఇప్పటికీ కళ్లలో కసి తగ్గని నటి రేఖ. బాలీవుడ్‌లో అడుగెట్టిన కొన్నేళ్లకే ప్రతి ఒక్కరి నోటా రేఖ పేరే. దీనికి కారణం హీరోలతో ఆమె పేరు జోడిస్తూ వార్తలు రావడమే. చాలామంది హీరోలతో ఆమె పేరు విన్పించినా ప్రేమ కధ అసంపూర్తిగానే మిగిలింది. పెళ్లి చేసుకుంంది కానీ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికీ రహస్యంగానే ఆమె జీవితం కొనసాగుతోంది.

2 /5

మరో కాంట్రోవర్సీ నటి రాఖీ సావంత్. ఈమె జీవితమంతా వివాదాలే కన్పిస్తాయి. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పుడే ప్రతి యేటా ఏదో ఒక వివాదంతో ముడిపడి ఉండేది. 

3 /5

నాటి తరం మేటి నటీమణుల్లో ఒకరు పర్వీన్ బాబి. అప్పట్లో కుర్రకారు గుండెల్ని కలవరపెట్టిన నటి. ఈమె జీవితమంతా వివాదాలే. సినిమాల్లో ఆమె కెరీర్ కేవలం 15 ఏళ్లే సాగింది. కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు పరిశ్రమను వదిలిపెట్టింది. తీవ్రమైన వ్యాధి వెంటాడి మానసిక పరిస్థితి పాడైంది.

4 /5

ఇక 90వ దశకంలో వెండితెరపై మెరిసిన మరో నటి మమతా కులకర్ణి. ఈమె జీవితం కూడా అంతా వివాదాలే. బోల్డ్ పోటోషూట్స్‌తో లేదా అండర్ వరల్డ్ సంబంధాలతో. మమతా కులకర్ణి ఏదో ఒక కారణంతో జీవితంలో వివాదాన్ని కొనితెచ్చుకునేది. ప్రస్తుతం ఇండస్ట్రీకు దూరంగా ఉంది. 

5 /5

ఇక కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెను కాంట్రోవర్సీ క్వీన్‌గా పిలుస్తారు. ప్రతి అంశంపై నర్మగర్భంగా మాట్లాడే కంగనా రనౌత్ ఇండస్ట్రీతో గొడవ పెట్టుకుంది. కంగనా చుట్టూ వివాదాలు నడుస్తూనే ఉంటాయి