Independence india: 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించింది. ఇక అప్పట్నించి ప్రారంభమైన భారతదేశ ప్రయాణం అప్రతిహంగా ముందుకు కొనసాగింది. అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంది. నలుగురిలో గర్వంగా నిలబడేలా చేసింది.
Independence india: అన్ని రంగాల్లో సామర్ధ్యం నిరూపించుకున్నట్టే ఆటల్లో కూడా ఇండియా ప్రత్యేకత నిలుపుకుంది. స్వాతంత్య్రం తరువాత దేశం వివిధ ఆటల్లో సాధించిన కొన్ని మైలురాళ్ల గురించి తెలుసుకుందాం..
మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని టీమ్ ఇండియా 2007 తొలి టీ20 ప్రపంచకప్ గెల్చుకుంది.
2004 ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల షూటింగ్ విభాగంలో రాజ్యవర్ధన్ రాధోడ్ రజత పతకం సాధించాడు.
2000 సెప్టెంబర్ 19 ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం గెల్చుకున్న తొలి మహిళగా కరణం మల్లేశ్వరి రికార్డు సాధించింది.
క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఇండియా అగ్రస్థానంలో ఉంది. కానీ 80వ దశకంలో పసికూన మాత్రమే. ఆ సమయంలోనే 1983 ప్రపంచకప్ టైటిల్ గెల్చుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. నాడు కపిల్ టీమ్ వేసిన బీజమే నేడు మహా వృక్షమై వెలుగుతోంది.
మాజీ ఆటగాడుప్రకాష్ పడుకోన్ 1980లో ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచాడు. 1981లో రన్నరప్ గా ఉన్నారు. 2001లో ఇండియా పుల్లెల గోపీచంద్ విజయం సాధించాడు.
హాకీ ప్రపంచకప్ 1975లో తొలిసారి పాకిస్తాన్‌పై గెలిచి సాధించింది. సుర్జీత్ సింగ్ చేసిన పెనాల్టీ కార్నర్ గోల్‌తో ఈ విజయం దక్కింది.
1948, 1952 ఒలింపిక్ క్రీడల్లో ఇండియా ఖషాభా జాదవ్ 1952 హెల్సింకీ ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం గెల్చుకున్నాడు.
ఆగస్టు 15,1947న స్వాతంత్య్రం పొందిన తరువాత భారతదేశం ఆటల్లో అద్భుతంగా రాణించింది. హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్ రంగాల్లో కీలక విజయాలు నమోదు చేసింది.