Krishna Janmashtami: ప్రతి యేటా భాద్రపద మాసంలోని కృష్ణపక్షం అష్టమి రోజున జన్మాష్టమి ఉంది. ఈసారి జన్మాష్టమి తిధి సెప్టెంబర్ 6 నుంచతి ప్రారంభమై సెప్టెంబర్ 7 వరకూ ఉంటుంది.
Krishna Janmashtami: అందుకే కొంతమంది సెప్టెంబర్ 6న జన్మాష్టమి జరుపుకుంటే..కొందరు సెప్టెంబర్ 7న జన్మాష్టమి నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో జన్మాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైన వస్తువుల గురించి తెలుసుకుందాం
జన్మాష్టమి నాడు వైజయంతి మాల కొంటే అంతా శుభం జరుగుతుందని ప్రతీతి. ఇంట్లో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.
జన్మాష్టమి రోజున ఆవు లేదా దూడవి చిన్న విగ్రహాలు కొనుగోలు చేసి పూజ గదిలో లేదా గదిలో ఈశాన్య దిశలో ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
కృష్ణ భగవానుడికి ఆవు, వెన్నంటే చాలా ఇష్టం. అందుకే జన్మాష్టమి రోజున వెన్న కొనుగోలు చేసి కృష్ణుడికి అర్పిస్తే మంచి లాభాలుంటాయి.
నెమలి పింఛంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందంటారు. ఇది వాస్తు దోషాన్ని కచ్చితంగా దూరం చేస్తుందని నమ్మకం. జన్మాష్టమి నాడు నెమలి పింఛం ఇంట్లో పెట్టడం వల్ల చాలా సమస్యల్నించి విముక్తి పొందవచ్చు.
జన్మాష్టమి రోజున మురళి కొనడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇంట్లో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. కృష్ణుడిని పూజించే సమయంలో తప్పకుండా మురళిని అర్పించాలి.