Nara Lokesh Emotional Note: చంద్రబాబుకు నాయుడికి రిమాండ్.. కన్నీళ్లతో నారా లోకేష్‌ ఎమోషనల్ నోట్

Chandrababu Naidu Judicial Remand Updates: నారా చంద్రబాబు నాయుడిని జ్యూడిషియల్ రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. జైలు వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై నారా లోకేష్‌ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Written by - Ashok Krindinti | Last Updated : Sep 10, 2023, 10:25 PM IST
Nara Lokesh Emotional Note: చంద్రబాబుకు నాయుడికి రిమాండ్.. కన్నీళ్లతో నారా లోకేష్‌ ఎమోషనల్ నోట్

Chandrababu Naidu Judicial Remand Updates: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తన తండ్రి నారా చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో టీడీపీ నేత నారా లోకేష్‌ ఆవేదన చెందారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. బాధతో బరువెక్కిన హృదయంతో.. కన్నీళ్లతో తడిసిన కళ్లతో ఈరోజు మీకు రాస్తున్నానంటూ చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన ఆత్మను ధారపోశారని చెప్పారు. లక్షలాది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్న ఆయనకు విశ్రాంతి అనేది తెలియదన్నారు. ఆయన రాజకీయాల్లో గౌరవం, నిజాయితీతో ఉన్నారు. ఆయన సేవకు ఎంతో మంది ప్రేరణ పొందారని.. వారి హృదయపూర్వక కృతజ్ఞతలు ఆయనలో స్వచ్ఛమైన ఆనందం నింపిందని అన్నారు.  

నేను కూడా ఆయన గొప్ప మార్గం నుంచి స్పూర్తి పొందాను. ఆయన అడుగుజాడల్లో నడిచాను. అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి మన దేశానికి తిరిగి వచ్చాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం. కానీ నాకు మన దేశం, మన వ్యవస్థలు, మన పునాది సూత్రాలు, అన్నింటికంటే మించి మన రాజ్యాంగంపై నమ్మకం ఉంది.

అయినప్పటికీ ఈ రోజు మా నాన్న ఎప్పుడూ చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే.. నా కోపం ఉప్పొంగింది. నా రక్తం ఉడికిపోతుంది. రాజకీయ పగ ముంచే లోతులకు హద్దులు లేవా..? తన దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఇంతటి ఘనకార్యం చేసిన నాన్న గారి స్థాయి వ్యక్తి ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలి..? ఎందుకంటే ఆయన ఎప్పుడూ పగ లేదా విధ్వంసక రాజకీయాలకు దిగలేదు..? ఆయన ఇతరుల కంటే చాలా కాలం ముందు మన ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, అవకాశాలను కల్పించినందుకా..?

ఈ రోజు నమ్మక ద్రోహంలా అనిపిస్తుంది. కానీ మా నాన్న పోరాట యోధుడు, నేనూ అలాగే.. ఆంధ్రప్రదేశ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అచంచలమైన సంకల్పంతో మార్గనిర్దేశం చేస్తూ తిరుగులేని శక్తితో ఎదుగుతాం. ఈ యుద్ధంలో నాతో కలిసి రావాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను.." అని నారా లోకేష్ రాసుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ రేపు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. తెలుగుదేశం నాయకులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. 

Also Read: SBI RD Interest Rates: ఎస్‌బీఐ ఆర్‌డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?

Also Read: Chandrababu Case: చంద్రబాబుకు రిమాండ్, 8 గంటల వాదనలు, 13 గంటల ఉత్కంఠలో ఏం జరిగింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News