Rain Alert: భానుడి భగభగలకు మండిపోతున్న ఆంధ్ర ప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఏపీలో రానున్న మూడు రోజులు భిన్న వాతావరణం నేపథ్యంలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.
Hero Nani Visits Tirumala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని ఆదివారం వేకువజామున సుప్రభాత సేవ లో నటుడు నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టి దర్శించుకున్నారు. మే 1వ తేదీన హిట్ 3 కేసు సినిమా విడుదల సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి సుప్రభాత దర్శనం కల్పించారు. ఆలయం వెలుపల నాని, శ్రీనిధి శెట్టితో భక్తులు ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
girl Attacks on Teacher with slipper: విజయనగరంలో ఇటీవల ఒక యువతి రెచ్చిపోయింది. తన సెల్ ఫోన్ తీసుకుందని లేడీ టీచర్ ను బూతులు తిడుతూ.. చెప్పుతొకొట్టింది. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారి, సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున నెటిజన్లు చర్యలు తీసుకొవాలని డిమాండ్ లు చేశారు.
Borugadda Anilkumar: వివిధ కేసుల్లో అరెస్టై ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తాను నకిలీ వైద్య ధ్రువీకరణ పత్రం పొంది మధ్యంతర బెయిల్ పొందినట్లు ప్రాసిక్యూషన్ చేసిన ఆరోపణలతో సంబంధం లేకుండా.. తన ప్రధాన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపేలా హైకోర్టును ఆదేశించాలని కోరుతూ.. బోరుగడ్డ దాఖలుచేసిన SLPపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Meenakshi Chowdary Visits Tirumala: తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో హీరోయిన్ మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి ప్రవేశించిన మీనాక్షి చౌదరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించారు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మీనాక్షి మాట్లాడుతూ.. నాగచైతన్య, నవీన్ పొలిశెట్టితో సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు.
Chappal Mala On RK Roja Effigy: ఆంధ్రప్రదేశ్‌లో ఆవుల మృతిపై రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్న వేళ జనసేన పార్టీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చొప్పుల దండ వేసి నిరసన చేయగా.. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. రోజా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Vijayasai Reddy Sensation Allegations On YS Jagan: వైఎస్సార్సీపీ నుంచి.. రాజకీయాల నుంచి వైదొలిగిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో జగన్ పాత్రపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
Gold Ornaments Theft In Indrakiladri Temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంపై భక్తురాలి కారులో దొంగతనం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఓంకారం టర్నింగ్ పాయింట్ వద్ద కారులో ఉంచిన 25 కాసులపై బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురం పెళ్లికి వెళ్తూ అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు దొంగతనం కావడంతో లబోదిబోమంటున్నారు. వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.
YouTuber Arrest In Tirumala: తిరుమలలో భద్రతా వైఫల్యం మరోసారి కనిపించింది. తిరుమల ఆలయంపై ఓ యూట్యూబర్ డ్రోన్‌తో వీడియోలు తీయడం కలకలం ఏర్పడింది. తిరుమల ప్రధాన ఆలయంపై మంగళవారం డ్రోన్ ఎగురవేసిన రాజస్థాన్‌కు చెందిన యూట్యూబర్‌ను ఎట్టకేలకు టీటీడీ అధికారులు, విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
Rain Alert To Andhra Pradesh For Coming Three Days: అధిక ఉష్ణోగ్రతలతో భగభగమండుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చల్లటి కబురు ఇది. రాబోయే మూడు రోజులు వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని ఏయే జిల్లాలకు వర్ష సూచనలు ఉన్నాయో తెలుసుకుందాం.
Love Marriage Turns Tragedy Continuous Three Incidents: పెద్దలను ధిక్కరించి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుని కొత్త జంట హాయిగా కాపురం చేసుకుంటుండగా.. కుటుంబసభ్యులు.. అనుమానం పెనుభూతంగా మారి వారి బంగారు భవిష్యత్‌ను కుప్పకూలుస్తున్నాయి. ఇలా ఏపీలో వరుసగా మూడు హత్యలు సంచలనం రేపాయి.
AP Cabinet Takes Key Decisions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలనాపరమైన.. విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు శుభవార్త వినిపించింది. ప్రత్యేకంగా టీచర్ల భర్తీ చేపట్టాలని నిర్ణయించింది. వీటితోపాటు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇవే.
RK Roja Likely To Good Bye From Politics: ప్రతిపక్షంలో.. అధికార పక్షంలో సంచలనాలకు కేంద్రంగా నిలిచిన మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారనే ప్రచారం వైరల్‌గా మారింది. సొంత పార్టీలో.. ప్రభుత్వపరంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆమె టీవీపై రీ ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం.
Arjun Son Of Vyjayanthi Movie Team In Tirumala: తిరుమల శ్రీవారిని అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రబృందం దర్శించుకుంది. హీరో కల్యాణ్ రామ్, నటి విజయశాంతితోపాటు చిత్రబృందం గురువారం ఉదయం నైవేద్య విరామంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం విజయశాంతి, కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 18వ తేదీన విడుదలవుతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాను అందరూ చూసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Yanamala Ramakrishnudu: ఏపీ టీడీపీలో ఆయనో సీనియర్ లీడర్.. మొన్నటి వరకు నెంబర్ టుగా కొనసాగిన ఆయనకు.. ఎమ్మెల్సీగా ప్రమోషన్ దక్కలేదు..! దాంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అటు సీఎం చంద్రబాబు కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు..! ఈ నేపథ్యంలో రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారా..! ఆయన పాలిటిక్స్‌కు గుడ్‌బై చెబితే.. ఆ జిల్లాలో పార్టీని ముందుండి నడిపే కథనాయకుడు ఎవరు..!
Once Again Duvvada Srinivas Madhuri Visits Tirumala: సంచలనాలకు కేంద్రంగా ఉన్న జంట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ - మాధురి మరోసారి తిరుమలలో హల్చల్ చేసింది. కాలినడకన తిరుమలకు చేరుకున్న శ్రీనివాస్, మాధురి బుధవారం శ్రీవారిని నైవేద్య విరామం లో దర్శించుకున్నారు. గతంలో మాధూరి శ్రీనివాస్ తిరుమలను సందర్శించిన సమయంలో చేసిన ఫొటోషూట్ హల్చల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జంట మరో రీల్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
SVSN Varma Big Shock To Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడుకు పిఠాపురం మాజీఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ షాక్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ రథసారథిగా నారా లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించాలని కొత్త నినాదం ఎత్తుకున్నారు. కాకినాడలోని టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ సందర్భంగా బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిపాదించిన వాటికి టీడీనీ నాయకులు మద్దతుగా నిలవడం విశేషం. లోకేశ్ పాదయాత్ర ద్వారానే ఎన్డీయేకు అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
Ravi Shastri Offers Special Pooja In Tirumala: భారత మాజీ క్రికెటర్, కామెంటెటర్ రవి శాస్త్రి తిరుమలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం నైవేద్య విరామంలో స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల రవిశాస్త్రిని చూసి అభిమానులు ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.
Heroine Rambha Ready To Movies Re Entry: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీనటి రంభ తన భర్త ఇంద్రకుమార్‌తో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం నైవేద్య విరామంలో స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పొందారు. పెళ్లి రోజున స్వామి వారిని దర్శించుకున్నట్లు రంభ తెలిపారు. 'నచ్చిన పాత్రలు వస్తే సినిమాల్లో రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నా' అని రంభ ప్రకటించారు.
Video Out Of TDP Women Leader Attacks Man With Slipper: అధికారం ఉందని రెచ్చిపోయిన ఓ తెలుగుదేశం పార్టీ నాయకురాలు పోలీస్ స్టేషన్లోనే చెప్పుతో దాడికి పాల్పడింది. ఈ వివాదం తీవ్ర దుమారం రేపగా ఎట్టకేలకు ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. గాజువాక పోలీస్ స్టేషన్లో జరిగిన దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.