Nipah Virus 2023: కేరళలో మరోసారి నిపా వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఇప్పటికీ కోజికోడ్ జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడి మరణించారు. అయితే ఇప్పటికే ఈ వ్యాధిపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యాధి నివారణకు పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నిపా వైరస్ వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందడానికి కారణాలేంటో? ఈ వ్యాధి కారణంగా శరీరంపై ఎలాంటి లక్షణాలు ఏర్పడతాయో? ఈ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నిపా వైరస్ అంటే ఏమిటి?
నిపా అనేది మనుషులు, జంతువుల మధ్య వ్యాపించే ఇన్ఫెక్షన్..దీనిని వైద్యులు జూనోటిక్ వ్యాధి అని కూడా అంటారు. ఇది కొన్ని జంతువుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఎక్కువగా వెన్నెముక, అస్థిపంజరాలు కలిగిన జంతువుల నుంచి సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది మొదట బెంగాల్‌లోని సిలిగురిలో 2001 వ్యాపించిందని ఆ తర్వాత మళ్లీ 2007లో విస్తరించడం పెరిగిందని వైద్య నివేదికల్లో పేర్కొన్నారు.
నిపా వైరస్ లక్షణాలు:
ఈ వ్యాధితో బాధపడేవారు మొదట్లో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు సమస్యలతో బాధపడతారని వైద్యులు చెబుతున్నారు. ఆ తర్వాత గొంతు నొప్పితో పాటు మైకము, మెదడువాపుతో బాధపడతారు. ఈ వ్యాధుల తీవ్ర తరమైన తర్వాత న్యుమోనియా, తీవ్రమైన శ్వాస సమస్యలు కూడా వస్తాయి. ఆ తర్వాత ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులు 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
నిపా వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
నిపా వైరస్ సోకిన పందులు లేదా గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందిలో ఈ వైరస్..మూత్రం లేదా మలం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. పండ్లపై ఇతర కీటకాలు వాలడం ద్వారా కూడా ఇలాంటి వైరస్ వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి.
నివారణ చర్యలు:
నిపా రాకుండా మీ శరీరాన్ని రక్షించుకోవడానికి తప్పకుండా జంతువుల స్థాలల నుంచి దూరంగా వెళ్లడం చాలా మంచిది.
వ్యాధి సోకిన జంతువులను చంపి, మృతదేహాలను కాల్చడం మంచిది.
వ్యాధి సోకిన వ్యక్తులకు దూరంగా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా మీరు ఉంటున్న ప్రదేశాలను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
వ్యాధి సోకిన వారు పచ్చి ఖర్జూరాల రసాన్ని తాగడం వల్ల మంచి లాభాలు పొందుతారు.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook