Libya Floods: లిబియా వరద బీభత్సం, డ్యాం తెగడంతో కొట్టుకుపోయిన 40 వేలమంది ప్రాణాలు

డేనియల్ తుపాను లిబియాలో విలయం సృష్టించింది. తుపాను, భారీ వర్షాల కారణంగా డెర్నా డ్యామ్ తెగిపడటంతో వేలాదిమంది మృత్యువాతపడ్డారు. 40 వేల వరకూ మరణించినట్టు సమాచారం.

Libya Floods: డేనియల్ తుపాను లిబియాలో విలయం సృష్టించింది. తుపాను, భారీ వర్షాల కారణంగా డెర్నా డ్యామ్ తెగిపడటంతో వేలాదిమంది మృత్యువాతపడ్డారు. 40 వేల వరకూ మరణించినట్టు సమాచారం.

1 /9

డెర్నా, ఇతర నగరాల్లో సహాయక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. శిధిలాల తొలగింపు కొనసాగుతోంది.

2 /9

వేలాదిమంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మృతుల సంఖ్య పెరుగుతోంది. విదేశాల్నించి లిబియా సహాయం అర్ధిస్తోంది.  

3 /9

మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ వినాశనంలో దాదాపు 40 వేలమంది చనిపోయారు. చాలా మృతదేహాలు సముద్రంలో కొట్టుకుపోయాయి.

4 /9

డెర్నా సృష్టించిన వినాశనం చూసేందుకు చాలా భయంకరంగా ఉంది. పెద్ద పెద్ద భవంతులు నేలకూలాయి. నగరంలో 25 శాతం మాయమైపోయింది. 

5 /9

డెర్నా నగరంలో లక్షమంది వరకూ ఉంటారు. ఒక డ్యామ్ తెగిన తరువాత చాలావరకూ నగరం దెబ్బతిన్నది.

6 /9

ఈ డ్యాంలు కూడా అంత పెద్దవేం కాదు. ఒక డ్యాం 70 మీటర్ల ఎత్తు. మొదటి డ్యాం తెగిన తరువాత రెండవ డ్యాం తెగేందుకు పెద్ద సమయం పట్టలేదు

7 /9

డెర్నాకు ఎగువన రెండు ప్రముఖ డ్యాంలు ఉన్నాయి. ఇందులో ఒక డ్యాం 2002 నుంచి మెయింటెనెన్స్‌కు నోచుకోలేదు. 

8 /9

డేనియల్ తుపాను కారణంగా లిబియా తూర్పు ప్రాంతంలో భారీ వరద పోటెత్తింది. డ్యాం తెగడం పరిస్థితిని అత్యంత భయంకరంగా మార్చింది.

9 /9

Libya Floods: లిబియాలో డేనియల్ తుపాను భారీ విధ్వంసం రేపింది. డెర్నా డ్యామ్ ఒక్కసారిగా తెగడంతో 40 వేలమంది వరకూ మరణించినట్టు అంచనా.