Team india Pics: కంట కన్నీరు, విషన్న వదనాలు, బరువెక్కిన గుండెతో టీమ్ ఇండియా ఆటగాళ్లు

ప్రపంచకప్ 2023 కల మరోసారి చెదిరిపోయింది. మూడవసారి కప్ చేజిక్కించుకోవాలనే ఆశ నిరాశగా మారింది. టీమ్ ఇండియా జట్టు ఆవేదనతో ఉండిపోయింది. మనసు విరిగింది. గుండె బరువైంది. భారమైన గుండెతో, విషన్న వదనాలతో , కంట నీరు ఆపుకుంటూ, కన్నీరు తుడుచుకుంటూ ఒక్కొక్కరి ముఖాన ఒక్కో ఆవేదన. చూసేవారికి సైతం గుండె బరువెక్కే దృశ్యాలు

Team india Pics: ప్రపంచకప్ 2023 కల మరోసారి చెదిరిపోయింది. మూడవసారి కప్ చేజిక్కించుకోవాలనే ఆశ నిరాశగా మారింది. టీమ్ ఇండియా జట్టు ఆవేదనతో ఉండిపోయింది. మనసు విరిగింది. గుండె బరువైంది. భారమైన గుండెతో, విషన్న వదనాలతో , కంట నీరు ఆపుకుంటూ, కన్నీరు తుడుచుకుంటూ ఒక్కొక్కరి ముఖాన ఒక్కో ఆవేదన. చూసేవారికి సైతం గుండె బరువెక్కే దృశ్యాలు

1 /5

నిరాశలో మునిగిపోయిన విరాట్ కోహ్లి టోర్నీలో అందరికంటే అత్యధికంగా పరుగులు సాధించిన విరాట్ కోహ్లి..ఓటమి తరువాత పూర్తిగా షాగురయ్యారు. ఒంటరిగానే గ్రౌండ్ విడిచి వచ్చేశారు. ఈ టోర్నీలో అత్యధికంగా 765 పరుగులు సాధించాడు. 

2 /5

వెక్కి వెక్కి ఏడ్చిన మొహమ్మద్ సిరాజ్ టీమ్ ఇండియా పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ అయితే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటిని టీ షర్ద్ తో తుడుచుకుంటూ కన్పించారు. వెక్కి వెక్కి ఏడుస్తున్న సిరాజ్‌ను తోటి ఆటగాడు బూమ్రా ఓదార్చడం కెమేరాలో రికార్డైంది. 

3 /5

షాక్ లో మొహమ్మద్ షమి కేవలం 7 మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు సాధించిన మొహమ్మద్ షమి ఓటమి తరువాత నిరాశలో ఉండిపోయారు. 

4 /5

రోహిత్ కళ్లలో నీరు వరుస 10 విజయాలతో ప్రపంచకప్ ఫైనల్‌లో ప్రవేశించిన టీమ్ ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తరువాత రోహిత్ శర్మ హృదయం బరువెక్కిపోయింది. కన్నీరు ఆపుకోలేకపోయారు. అతని భార్య రితికా సైతం కన్నీరు పెట్టింది. 

5 /5

విచారంలో కేఎల్ రాహుల్ టీమ్ ఇండియా పరాజయం తరువాత కేఎల్ రాహుల్ తీవ్ర విచారంలో మునిగిపోయి..గ్రౌండ్‌లో కూర్చుండిపోయాడు.