Health Tips: ఈ పదార్ధాలు డైట్‌లో ఉంటే చాలు..చలికాలంలో ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ

చలికాలంలో ఎప్పుడూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శీతాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. అంతేకాకుండా శరీరంలో ఎనర్జీ తగ్గిపోతుంది. అందుకే ఈ సమయంలో కొన్ని ప్రత్యేక ఆహార పదార్ధాలు తీసుకోవాలి.

Health Tips: చలికాలంలో ఎప్పుడూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శీతాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. అంతేకాకుండా శరీరంలో ఎనర్జీ తగ్గిపోతుంది. అందుకే ఈ సమయంలో కొన్ని ప్రత్యేక ఆహార పదార్ధాలు తీసుకోవాలి.

1 /8

చలికాలంలో నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వివిధ రకాల వ్యాధులు దూరమౌతాయి. శరీరానికి కావల్సినంత ఎనర్జీ లభిస్తుంది. 

2 /8

చిలకడదుంప శీతాకాలంలో విరివిగా లభిస్తోంది. ఇందులో పోషకాలు చాలా ఎక్కువ. చలికాలంలో చిలకడదుంప వినియోగంతో చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి.

3 /8

అల్లం తులసి మిశ్రమంతో చలికాలంలో కాడా తయారు చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వివిధ రకాల వ్యాధుల దూరమౌతాయి. 

4 /8

చలికాలంలో తేనె వినియోగం చాలా మంచిది. జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యల్నించి విముక్తి కల్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. చర్మానికి నిగారింపు అందిస్తుంది. 

5 /8

పసుపులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫైబర్, కాపర్, జింక్, ఫాస్పరస్‌తో పాటు విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే వంటి చాలా ఉంటాయి. అందుకే పసుపును చలికాలంలో ఉపయోగించడం వల్ల చాలా వ్యాధుల దూరమౌతాయి.

6 /8

చలికాలంలో చాలా రకాల కూరగాయలు లభ్యమౌతుంటాయి. మార్కెట్‌లో ఆకుపచ్చ కాయగూరలు, ఆకు కూరలు చాలా లభిస్తాయి. పాలకూర, మెంతి కూర, తోటకూర వంటివి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇమ్యూనిటీ చాలా వేగంగా పెరుగుతుంది. 

7 /8

బెల్లం వినియోగం చలికాలంలో చాలా మంచిది. బెల్లం అనేది శరీరంలో వేడిని పుట్టిస్తుంది. దాంతోపాటు రక్తాన్ని శుభ్రం చేసి రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. బెల్లం తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. 

8 /8

డిసెంబర్ నెల ప్రారంభమైపోయింది. చలి తీవ్రత పెరిగిపోతోంది. చలిగాలులు, చలి నుంచి కాపాడుకునేందుకు వేడి దుస్తులు ధరించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆహార పదార్ధాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. డైట్‌లో కొన్ని మార్పులు తప్పకుండా చేయాలి.