Kuwait Pics: ప్రపంచంలోని అత్యంత వేడి ప్రాంతాల్లో ఒకటి కువైట్. ఇప్పుడా దేశంలో ఎన్నడూ కన్పించని అందమైన దృశ్యాలు కన్పిస్తున్నాయి. మేఘాలు ఆవహించి ఉన్న కువైట్ అందాలు చాలా సుందరంగా కన్పిస్తున్నాయి. మేఘాల చాటున కువైట్‌లోని సుప్రసిద్ధ మూడు వాటర్ టవర్స్‌లో రెండే కన్పిస్తున్నాయి. ఒకటి మేఘాల్లో కప్పుకుపోయింది.
కువైట్ టవర్స్‌ను డానిష్ వాస్తు శిల్పి మెలైన్ బ్యోర్న్ చేశాడు. కువైట్ టవర్స్ అధికారికంగా 1979లో ప్రారంభమైంది. టవర్లను మరమ్మత్తుల నిమిత్తం మార్చ్ 2012 నుంచి 8 మార్చ్ 2016 వరకూ మూసివేశారు.
రెండవ టవర్ ఎత్తు 147 మీటర్లు. దీనిని వాటర్ టవర్ అంటారు. 4500 క్యూబిక్ మీటర్ల సామర్ధ్యం కలిగిన ట్యాంక్ ఇది. మూడవ టవర్ వాటర్ స్టోరేజ్ కాదు. ఈ రెండు టవర్లను నిగనిగలాడేలా చేసేందుకు ఉపయోగిస్తుంటారు.
కువైట్‌లో మూడు ప్రధాన టవర్ల ఎత్తు 187 మీటర్లు. అడుగుల్లో చెప్పాలంటే 614 అడుగులు. ఇందులో రెండు గోళాలున్నాయి. అన్నింటికంటే పైనున్న గోళంలో 90 మంది సామర్ధ్యం కలిగిన రెస్టారెంట్ ఉంటుంది. ఇందులో ఒక కేఫే, ఒక లాంజ్ ఉన్నాయి. దిగువన ఉన్న గోళంలో 4500 క్యూబిక్ మీటర్ల సామర్ధ్యం కలిగిన ట్యాంక్ ఉంది.
ప్రస్తుతం కువైట్‌లో మేఘాలు అలముకుని ఉండటంతో నగరం మరింత అందంగా కన్పిస్తోంది. మేఘాలు ఎంతగా ఉన్నాయంటే కేవలం రెండు టవర్ల పైభాగమే కన్పిస్తోంది.
కువైట్ టవర్స్ నగరంలోని మూడు దిగ్గజ టవర్లలో ఒకటి. అరేబియన్ గోల్ఫ్ రోడ్‌లో ఉన్న ఈ టవర్ బెస్ట్ ల్యాండ్ మార్క్‌గా ఉంది. అద్బుతమైన పర్యాటక ప్రాంతంగా నిలిచింది.