Ram mandir Beautiful Pics: అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడిప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఓ పండుగలా జరగనుంది. అటు రామమందిరం..ఇటు అయోద్య పట్టణం సుందరంగా ముస్తాబవుతోంది. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం ఆలయం రంగు రంగుల పూవులతో అలంకృతమౌతోంది. ఆ ఫోటోలు మీ కోసం..
రామమందిరం పూలతో అలంకరించుకుంటూ అత్యంత సుందరంగా కన్పిస్తోంది.
జనవరి 19న రామ్‌లల్లా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. జనవరి 22వ తేదీన జరిగే ప్రాణ ప్రతిష్ఠను ఆకర్షణీయంగా మార్చేందుకు మొత్తం ప్రాంగణాన్ని పూలతో నింపుతున్నారు.
పూల అలంకరణతో పాటు రామమందిరంలో ఇతర ప్రదర్శనలు కూడా ఏర్పాటవుతున్నాయి. ప్రాణ ప్రతిష్టం కంటే ముందే లేజర్ షో అందర్నీ అలరించింది.
రామమందిరం ప్రారంభోత్సవం పురస్కరించుకుని దేశం నలుమూలల్నించి భక్తులు, ప్రముఖులు తరలివస్తున్నారు. ఆలయం ప్రధాన ద్వారం నుంచి లోపలి వరకూ మొత్తం పూలతో అలంకరించారు. అయోధ్య నగరంలో దీపావళి పండుగ వాతావరణం నెలకొంది.
రామమందిరంలో రామ్‌లల్లా విగ్రహాల ప్రాణ ప్రతిష్ట జనవరి 22వ తేదీ మద్యాహ్న 12.20 నిమిషాలకు ప్రారంభం కానుంది. రామమందిరంలో ఐదురోజుల అనుష్టానం జనవరి 16న ప్రారభమైంది. ప్రస్తుతం ఆలయంలో యజ్ఞం, యాగాలు నడుస్తున్నాయి.
జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. దీనికోసం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలోని హిందూవులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఆలయమంతా పూవులతో నిండిపోతోంది. రామమందిరం సౌందర్యం రెండు కళ్లు చూడలేకున్నాయి.