Upcoming IPO: షేర్ మార్కెట్ అనేది పెట్టుబడికి మంచి మార్గం. అదృష్టం కలిసొస్తే అద్భుతమైన లాభాలు ఆర్జించవచ్చు. అయితే నిశిత పరిశీలన తప్పకుండా ఉండాలి. మీరు కూడా షేర్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటే సెబీ ఇప్పటికే 4 కంపెనీల ఐపీవోలకు అనుమతి మంజూరు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ఎగ్జికామ్ టెలీ సిస్టమ్ లిమిటెడ్‌కు చెందిన ఐపీవోలో 400 కోట్ల రూపాయల వరకూ కొత్త షేర్లు జారీ కానున్నాయి. ఇందులో 74 లక్షల ఈక్విటీ షేర్లు ఉంటాయి.
జేఎన్‌కే ఇండియా ఐపీవోలో 300 కోట్లు రూపాయల విలువైన కొత్త షేర్లు జారీ చేయనుంది. ఇందులో 84.21 లక్షల ఈక్విటీ షేర్లు ఉండవచ్చు. ఇక యాక్మే ఫిన్‌ట్రేడ్ ఇండియా లిమిటెడ్ ఐపీవో 1.1 కోట్ల ఈక్విటీ షేర్ల విక్రయాలుంటాయి.
ఏంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ ప్రకారం ఈ ఐపీవో ద్వారా 1000 కోట్లు రూపాయల షేర్లు జారీ చేయవచ్చు. ఇందులో 85.57 లక్షల ఈక్విటీ షేర్లు విక్రయాలు జరగనున్నాయి.
జనవరి 19 వరకూ సెబీ వద్ద ఉన్న ఐపీవో డాక్యుమెంట్ల ప్రకారం నాలుగు ఐపీవోల విక్రయాలకు మంజూరు లబించింది. జూన్-అక్టోబర్ మధ్యకాలంలో ఈ కంపెనీలు ఐపీవో అనుమతికి డాక్యుమెంట్లు సమర్పించాయి. జనవరి 16-19 మధ్యకాలంలో వీటికి అనుమతి లభించింది.
సెబీ అనుమతి మంజూరు చేసిన ఐపీవోల్లో ఎంటెరో హెల్త్‌కేర్, జేఎన్‌కే ఇండియా, ఎగ్జికామ్ టెలీ సిస్టమ్, యాక్మే ఫిన్‌ట్రేడ్ ఇండియా ఉన్నాయి.