Hindu Temple: ప్రసిద్ధ హిందూదేవాలయాల్లో హిందూయేతరులు ప్రవేశంచకూడదని మద్రాస్ హైకోర్ట్ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.. అయితే, దేశవ్యాప్తంగా 6 దేవాలయాలకు హిందూయేతరులు నిషేధం అని మీకు తెలుసా? ఇక్కడ కేవలం హిందూవులకే ప్రవేశం కల్పిస్తారు.
పూరీజగన్నాథ ఆలయం.. ఈ ఆలయంలో కూడా హిందూయేతరులకు నిషేధం ఉంది. ముస్లిం పాలకులు దాడుల తర్వాత నిషేధం విధించారు.
కపాలీశ్వర్ ఆలయం.. 17వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం ద్రావిడ నాగరికతకు చెందిన శివాలయం. ఇక్కడ కూడా హిందూయేతరులతోపాటు విదేశీ పర్యాటకులకు కూడా నిషేధం.
గురువాయూర్.. ఐదువేల సంవత్సరాల నాటి ఈ ఆలయం శ్రీకృష్ణుని బాల స్వరూపంగా ఉంటారు. హిందూయేతరులకు ఈ ఆలయంలో నిషేధం.
దిల్వారా ఆలయం.. ఇది జైనమతం ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. 11,13 వ శతాబ్దాల మధ్య నిర్వహించిన ఈ ఆలయంలో కూడా హిందూయేతరులకు నిషేధం.
కాశీవిశ్వనాథ ఆలయం.. జీవితంలో ఒక్కసారైనా హిందూవు అయినవారు కాశీకి వెళ్లాలని కోరుకుంటారు. ఇక్కడ కూడా హిందూయేతరులకు నిషేధం కానీ, విదేశీ హిందూవులకు ఈ ఆలయంలో ప్రవేశం ఉంది.
లింగరాజ టెంపుల్.. ఒడిశాలోని ఈ ఆలయంలో గతంలో విదేశీయులు ప్రవేశించేవారు. 2012 లో ఓ విదేశీ పర్యాటకుడు ఆచారాలకు అంతరాయం కలిగించడంతో హిందూయేతరులను నిషేధించారు.