Pooja Hegde: రెడ్ డ్రెస్ లో పూజహెగ్డే హాట్ హాట్ స్టిల్స్.. ఫిదా అయిపోయిన అభిమానులు..

Pooja Hegde in Red: పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై ఆ తరువాత ఎన్నో అవకాశాలతో దూసుకుపోయింది ఈ స్టార్ హీరోయిన్. ప్రస్తుతం రెడ్ డ్రెస్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూజ ఫోటోలు చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు.

  • Feb 02, 2024, 23:01 PM IST
1 /5

Pooja in Red: నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ పూజా హెగ్డే. ఆ తరువాత ముకుంద సినిమాతో మరింత చేరువయ్యింది.

2 /5

అక్కడి నుంచి వరుసగా ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ కి ఎదిగింది. స్టార్ హీరోలు, చిన్న హీరోలు అని తేడా లేకుండా దాదాపు అందరూ హీరోలతోనే చేసింది ఈ హీరోయిన్.

3 /5

ఈ హీరోయిన్ కెరియర్ లో అలా వైకుంఠపురం లాంటి ఇండస్ట్రీ హిట్ కూడా అందుకుంది. జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో అరవింద క్యారెక్టర్ లో కనిపించి అందరినీ తన నటనతో మెస్మరైజ్ చేసింది.

4 /5

అయితే ప్రస్తుతం మాత్రం పూజా హెగ్డే కి తెలుగులో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల ఆఫర్లను పోగొట్టుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు సాయిధరమ్ తేజ్ సినిమాని సైతం వదులుకుందని వార్తలు వస్తున్నాయి.

5 /5

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ రెడ్ డ్రెస్ లో కారు ముందు నిలబడుకొని ఫోజులు ఇచ్చిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ఆమె అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫోటోలలో ఈ హీరోయిన్ ఎంతో అందంగా కనిపిస్తూ మరోసారి ఆమె వెండితెరపై ఎప్పుడు కనిపిస్తుంది అని అభిమానుల్లో రేకెత్తిస్తోంది.