Tirumala Tirupati Devasthanam Darshan: సాధారణంగా తిరుమలకు వెళ్లాలంటే రూ. 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఉండాల్సిందే. సర్వదర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా సులభం వేంకటేశుని దర్శనభాగ్యం కలుగుతోంది. ఎలానో తెలుసా?
సాధారణంగా తిరుమలకు వెళ్లాలంటే రూ. 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఉండాల్సిందే. సర్వదర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదా డబ్బు కాస్త ఎక్కువగా పెట్టుకునే వారు శ్రీవాణి దర్శనం పై రూ.10 వేల టిక్కెట్ కొనుగోలు చేసి తిరుమల వేంకటేశుని దర్శనం చేసుకుంటారు. అయితే, ఎక్కువ డబ్బు ఖర్చు లేకుండా శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తారంటే మీకు ఓకేనే కదా.. అది ఎలాగో తెలుసుకుందాం.
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలి అంటారు. చాలామంది తన వీలును బట్టి వెళ్తునే ఉంటారు. ఏ ఇబ్బంది కలుగుకుండా ముందుస్తు ప్రణాళిక వేసుకుని వెళ్లాలంటే ఆన్లైన్ టిక్కెట్లు కొనుగోలు చేసి వెళ్తారు. అది మనం అనుకున్న సమయానికి దొరకదు. ఒక్కోసారి ఆన్లైన్లో పెట్టిన అరగంటకే కూడా టిక్కెట్లు అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పదివేలు పెట్టి శ్రీవాణి టిక్కెట్లు కొనుగోలు చేయలేని పరిస్థితి. గంటల సమయం కేటాయించి బ్రేక్ దర్శనం టిక్కెట్లు కొనలేకపోతాం. దీనికి మేం మీకు సహాయం చేస్తామని ముందుకు వస్తోంది ఆర్టీసీ.
ఆర్టీసీ బస్సుల్లోనే రూ.300 టిక్కెట్లు విక్రయిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆర్టీసీ బస్సులో వెళ్లాలనుకునే వారికి ఈ సదుపాయం కల్పించింది ఆర్టీసీ. దీనికి రెండు రాష్ట్రప్రభుత్వాలు ఈ టిక్కెట్లను విక్రయిస్తున్నారు.
సాధారణంగా తిరుపతి దర్శనానికి వెళ్లడానికి తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు రూ. 300 టిక్కెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. కానీ, రోజుకు కేవలం వెయ్యి మంది మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందుతారు. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ద్వారా ఈ టిక్కెట్లు కొనుగోలు చేయాలనుకుంటే కేవలం ఆరురోజుల ముందుగా బుక్ చేసుకుంటే సరిపోతుంది.
ఆర్టీసీ ద్వారా రూ.300 టిక్కెట్లు కొనుగోలు చేసి శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ఒకే సమయంలో తిరుపతికి బస్సు టిక్కెట్లతోపాటు రూ.300 దర్శనం టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. దీనికి ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ https://www.tsrtconline.in/oprs-web/ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది.