Top 5 Mileage Bikes: ప్రస్తుతం ఎక్కడ చూసినా 150 సిసీ బైకులే కన్పిస్తున్నాయి. అందరూ ఇష్టపడేది కూడా ఇవే. అయితే మైలేజ్ ఎక్కువగా ఇచ్చి, మెయింటెనెన్స్ తక్కువగా ఉండే 150-160 సిసి బైక్స్ అంటే దాదాపు అందరూ ఆసక్తి చూపిస్తారు. అందుకే అలాంటి టాప్ 5 బైక్స్ గురించి తెలుసుకుందాం.
Bajaj Pulsar N150 Bajaj Pulsar N150 మరో అద్బుతమైన బైక్. లీటర్‌కు 47 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
Hero Xtreme 160R Hero Xtreme 160Rలో 160 సిసి ఎయిర్‌కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది లీటర్‌కు 49 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
Bajaj Pulsar N160 Bajaj Pulsar N160 కేవలం పనితీరులోనే కాకుండా లీటర్‌కు 51.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ ధర 1.33 లక్షల రూపాయలుగా ఉంది.
TVS Apache RTR 160 టీవీఎస్ ఎపాచీ ఆర్టీఆర్ 160లో 159.7 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ బైక్ అవుట్‌పుట్ 15.82 బీహెచ్‌పి, 13.85 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. లీటర్‌కు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
Honda SP160 Honda SP160 యూనికార్న్ బైక్ 150-160 సీసీ వెర్షన్ ఇది. సింగిల్ సిలెండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ వీటి ప్రత్యేకతలు. యూనికార్న్ బైక్ అయితే లీటరుకు 60 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తే...Honda SP160 మాత్రం 65 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంటుంది.