Ayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నాకు నచ్చదు.. ‘కలియుగం పట్టణంలో’ హీరోయిన్ ఆయుషి పటేల్

Kaliyugam Pattanamlo Movie: తనకు లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ వంటివి నచ్చవని ‘కలియుగం పట్టణంలో’ హీరోయిన్ ఆయుషి పటేల్ తెలిపారు. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే తాను ఎంచుకుంటున్నానని చెప్పారు. డబ్బు సంపాదించేందుకు తాను ఇండస్ట్రీలోకి రాలేదన్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2024, 05:40 PM IST
Ayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నాకు నచ్చదు.. ‘కలియుగం పట్టణంలో’ హీరోయిన్ ఆయుషి పటేల్

Kaliyugam Pattanamlo Movie: కలియుగం పట్టణంలో మూవీ రేపు (మార్చి 29) ఆడియన్స్‌ ముందుకు రానుంది. రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ క్రమంలో హీరోయిన్ ఆయుషి పటేల్ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాలో తన పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని.. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా ఉండదన్నారు. తన క్యారెక్టర్ ఇంటర్వెల్‌లో ఒక మాదిరి.. క్లైమాక్స్‌లో మరో ఒపీనియన్ వస్తుందన్నారు. 

Also Read: Samantha - Naga Chaitanya Divorce: సమంత, నాగ చైతన్య విడాకులపై తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్స్..  

"చిన్నతనం నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. ఆయనలానే ఎదగాలని అనుకునేదాన్ని. ఈ మూవీ నాకు ఓ మేనేజర్ వల్ల వచ్చింది. ఈ మూవీ కోసం ఎన్నో వర్క్ షాప్స్ చేశాం. ఆ టైంలోనే హీరో విశ్వతో కలిసి ఎన్నో సీన్ల గురించి చర్చించుకున్నాం. కడపలో అందమైన లొకేషన్స్ చాలా ఉన్నాయి. అక్కడి ప్రజలు ఎంతో సపోర్ట్ చేశారు. అక్కడ ఈ చిత్రాన్ని ఎంతో సరదాగా షూట్ చేశాం. చాలా పార్ట్ అక్కడే షూట్ చేశాం. కొంత మాత్రం హైదరాబాద్‌లో షూట్ చేశాం.

ప్రస్తుతం మేం ఈ మూవీ ప్రమోషన్స్ కోసం టూర్స్ వేస్తున్నాం. వెళ్లిన ప్రతీ చోటా మంచి రెస్పాన్స్ వస్తోంది. మమ్మల్ని అందరూ గుర్తు పడుతున్నారు. మా సినిమా టీజర్, ట్రైలర్ గురించి చెబుతున్నారు. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా నా గురించి, నా ఫస్ట్ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మా డైరెక్టర్ ఏం చెప్పారో అదే తీశారు. ఆర్ఆర్ వల్ల సినిమా మరోస్థాయికి వెళ్లింది. నిర్మాతలు మాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. మా అందరినీ చక్కగా చూసుకున్నారు. సినిమాకు ఎంత ఖర్చైనా కూడా వెనుకాడలేదు. ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. మంచి సినిమా తీశాం.. దాన్ని ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్లాలని మా నిర్మాతలు తపనపడుతుంటారు.

హీరో విశ్వ కార్తికేయ నాకు ఎంతో సహకరించారు. ప్రతీ సీన్ గురించి చర్చించుకునేవాళ్లం. ఇలా చేద్దాం.. అలా చేద్దాం అని మాట్లాడుకునేవాళ్లం. ఇంత మంచి వ్యక్తితో నా మొదటి సినిమా రావడం ఆనందంగా ఉంది. కలియుగం పట్టణంలో రిలీజ్ కాకముందే నాకు మూడు ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చాయి. లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ వంటివి నాకు నచ్చదు. అందుకే చాలా సినిమాలు ఒప్పుకోలేదు. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నాను. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి రాలేదు. కొన్ని సినిమాలు చేసినా పర్లేదు.. మంచి చిత్రాలు చేయాలని అనుకుంటున్నాను.." అని ఆయుషి పటేల్ చెప్పుకొచ్చారు.

Also Read:  Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News