Summer Healthy Drinks: వేసవిలో పిల్లలకు ఈ 4 డ్రింక్స్ కచ్చితంగా ఇవ్వండి.. వడదెబ్బకు గురికాకుండా కాపాడతాయి..

Summer Healthy Drinks: మండే ఎండకాలం.. భానుడి ప్రతాపంతో పిల్లలు పెద్దలు అందరూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడదెబ్బకు గురవుతున్నారు. స్కూళ్లు కూడా మిట్టమధ్యాహ్నం వరకు ఉంటున్నాయి.

Summer Healthy Drinks: మండే ఎండకాలం.. భానుడి ప్రతాపంతో పిల్లలు పెద్దలు అందరూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడదెబ్బకు గురవుతున్నారు. స్కూళ్లు కూడా మిట్టమధ్యాహ్నం వరకు ఉంటున్నాయి. దీంతో పిల్లలు ఎండ వేడిమి తట్టుకోలేకపోతుంటారు. తీవ్రంగా అలసట, జ్వరం కూడా రావచ్చు. అందుకే వేసవి వేడిమి నుంచి తట్టుకోవడానికి కొన్ని ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ వారికి ఇవ్వండి. త్వరగా వేడిమి నుంచి ఉపశమనం పొందుతారు. అయితే, అలా అని ఐస్‌క్రీములు, చల్లని నీరు ఇవ్వకండి. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. 
 

1 /5

Summer Healthy Drinks: మండే ఎండకాలం.. భానుడి ప్రతాపంతో పిల్లలు పెద్దలు అందరూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడదెబ్బకు గురవుతున్నారు. స్కూళ్లు కూడా మిట్టమధ్యాహ్నం వరకు ఉంటున్నాయి.

2 /5

మజ్జిగ.. వేసవి వేడిమిని తట్టుకోవడానికి శక్తినిచ్చే మరో పానియం మజ్జిగ. ఇది కూడా మన పూర్వీకుల కాలం నుంచి ఎండ వేడిమి తట్టుకోవడానికి తీసుకుంటారు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే కూడా మజ్జిగను తప్పకుండా ఇచ్చే ఆచారం  కూడా ఉంది. ముఖ్యంగా వేసవి కాలంలో కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. అటువంటి వారు మజ్జిగ తీసుకోవాలి. ఇది పేగు ఆరోగ్యానికి మంచి పానియం.

3 /5

పుచ్చకాయ.. పుచ్చకాయ కూడా వేసవి వేడిమిని తట్టుకునే శక్తినిస్తుంది. ఈ పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ గురికాకుండా ఉంటారు. పిల్లలకు జ్యూస్ రూపంలో లేదా సలాడ్‌ రూపంలో ఇవ్వచ్చు. పుచ్చకాయను తింటే వడదెబ్బకు గురికాకుండా ఉంటారు. ఇది అందరికీ ఇష్టమైన పండు కూడా

4 /5

కొబ్బరిబోండం.. పిల్లలకే కాదు పెద్దలకు అందరికీ ఇది మంచి ఆరోగ్యకరమైన పానియం. కొబ్బరి బోండం తీసుకుంటే వేసవి వేడిమి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఎండకాలం రోజూ ఓ కొబ్బరిబోండం పిల్లలకు ఇవ్వండి. ఇది డీహైడ్రేటేట్‌ కాకుండా కాపాడుతుంది. అంతేకాదు రోజంతటికీ కావాల్సిన శక్తిని కూడా అందిస్తుంది.

5 /5

నిమ్మకాయ నీరు.. ఇది మన అందరి ఇళ్లలో సులభంగా దొరుకుతుంది. వేసవి వేడిమికి తక్షణ శక్తినిస్తుంది. నిమ్మకాయ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇది పిల్లలకు ఇవ్వచ్చు. లెమన్ వాటర్ ముఖ్యంగా సాల్ట్‌ వేసుకుని తాగితే మంచిది.