Worst Breakfast Foods: బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 వస్తువులను తీసుకోవడం చాలా ప్రమాదకరం..!

5 Worst Breakfast Foods: ఉదయం మీరు ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలి అంటే తప్పకుండా బ్రేక్‌ ఫాస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్రేక్‌ ఫాస్ట్ చేసే సమయంలో మీరు ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని రకాల ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల మంచికి బదులు చెడు కలుగుతుంది. 

  • Apr 20, 2024, 17:50 PM IST

5 Worst Breakfast Foods: ఉదయం బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యమైన భోజనం. ఎందుకంటే రాత్రి నిద్రలేచిన తర్వాత శరీరానికి శక్తి అవసరం అవుతుంది. కాబట్టి బ్రేక్‌ ఫాస్ట్‌ చేయడం చాలా అవసరం. అయితే కొన్ని ఆహార పదార్థాలు బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల శక్తికి బదులుగా అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. మీరు బ్రేక్‌ ఫాస్ట్‌లో షుగర్‌, అతిగా వేయించిన ఆహారపదార్థాలు, కార్బోనేటేడ్‌ డ్రింక్స్‌ను ఉదయం లేచిన తరువాత తీసుకోవడం వల్ల తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి బదులుగా మీరు పండ్లు, కూరగాయలు, ఓట్స్‌, పాలు ఇతర పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా, దృఢంగా తయారు అవుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. 

1 /5

ఉదయం ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీని తీసుకోవడం మానుకోండి. ఇందులో ఉండే కెఫిన్ వల్ల పొట్టలో యాసిడ్ ఏర్పడి వాపు వస్తుంది. దీనికి బదలుగా మీరు పండ్ల రసాలు తీసుకోవడం చాలా మంచిది. 

2 /5

ఖాళీ కడుపుతో కార్బోనేటేడ్ డ్రింక్స్ వంటి శీతల పానీయాలు తాగడం వల్ల ఎసిడిటీ , కడుపు నొప్పి వస్తుంది. ఇందులో ఉండే కెమికల్స్‌ శరీరానికి హనీ కలిగిస్తుంది. 

3 /5

ఆరెంజ్‌, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను ఉదయాన్నే తింటే కడుపులో ఎసిడిటీ వస్తుంది. దీనికి బదులుగా మీరు ఇతర పండ్లను తీసుకోవడం చాలా మంచిది.   

4 /5

ఉదయం పూట స్పైసీ లేదా స్పైసీ ఫుడ్ తినడం మానుకోండి. ఇది పొట్టపై వాపుకు కారణం కావచ్చు. అలాగే జీర్ణవ్యస్థను దెబ్బతీస్తుంది.   

5 /5

బ్రేక్ ఫాస్ట్‌లో అతిగా  వేయించిన ఆహారాన్ని తినడం మానుకోవాలి. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఆహారం జీర్ణం అవ్వడం చాలా కష్టం.