Lip Care Tips: అమ్మాయిల అందానికి కేరాఫ్ అంటే పెదాలని చెప్పవచ్చు. ఆ పెదాలే అందంగా లేకుంటే చాలా ఆందోళన చెందుతుంటారు. కొంతమందికైతే పెదాలు నల్లబడిపోతుంటాయి. అందుకే శరీరంపై శ్రద్ధ పెట్టినట్టే పెదాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. లిప్ కేర్ అనేది చాలా కీలకం. మీ పెదాలు కూడా నల్లగా ఉంటే..తిరిగి పింక్ కలర్‌లో మార్చే కొన్ని చిట్కాలు తెలుసుకుందాం..
బీట్‌రూట్ బీట్‌రూట్ రోజూ పెదాలకు రాయడం వల్ల పింక్ రంగులో మారుతుంటాయి. అద్బుతమైన నిగారింపు కూడా వస్తుంది. ఇందులో ఉండే బీటాలెన్స్ ఇందుకు ఉపయోగపడతాయి.
కీరా కీరా అనేది కేవలం కంటి కింద డార్క్ సర్కిల్స్ కోసమే కాదు పెదాల నల్లదనాన్ని పోగొట్టేందుకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి వల్ల పెదాలకు లాభం కలుగుతుంది. కీరా రసాన్ని రోజూ పెదాలకు రాయడం మంచి అలవాటు
పంచదారతో స్క్రబ్ పెదాలపై ఉండే చర్మం మిగిలిన చర్మంతో పోలిస్తే చాలా సెన్సిటివ్. అందుకే ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. వీటిని పట్టించుకోకపోతే నల్లబడిపోతుంటాయి. పంచదార స్క్రబ్ పెదాలు చాలా ఉపయోగకరం. పెదాల నల్లదనం దూరం చేసేందుకు రోజూ పంచదారతో మీ పెదాల్ని స్క్రబ్ చేస్తుండాలి.
పెదాలకు మాయిశ్చరైజర్ పెదాలకు మాయిశ్చరైజర్ చాలా అవసరం. దీనివల్ల పెదాలు పగలకుండా ఉంటాయి. నల్లబడవు. ముఖానికి రాసినట్టే పెదాలకు కూడా రోజూ మాయిశ్చరైజర్ రాస్తుండాలి. అప్పుడే పెదాలు పింక్ రంగులో మెరుస్తుంటాయి. నిమ్మకాయతో పెందాల్ని రోజూ మసాజ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
పంచదార-తేనె-మీగడ పెదాలు మృదువుగా, పింక్ రంగులో మిళమిళలాడుతుండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చాలామంది శరీరంపై పెట్టే శ్రద్ధ పెదాలపై పెట్టరు. పెదాలు అందంగా పింక్ రంగులో మెరవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. తేనె-పంచదార-మీగడను కలిపి ఈ మిశ్రమాన్ని రోజూ పెదాలకు రాస్తుండాలి