Spinach Juice Benefits: రాత్రి పడుకునే ముందు పాలకూర జ్యూస్‌ తాగితే మీ శరీరంలో జరిగే అద్భుతాలు..

Spinach Juice Benefits: పాలకూర జ్యూస్ తాగడం వల్ల మన చర్మం, జుట్టు, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి డ్యామేజ్ సేల్స్ ని రిపేర్ చేస్తాయి.

Written by - Renuka Godugu | Last Updated : May 25, 2024, 07:51 AM IST
Spinach Juice Benefits: రాత్రి పడుకునే ముందు పాలకూర జ్యూస్‌ తాగితే మీ శరీరంలో జరిగే అద్భుతాలు..

Spinach Juice Benefits: పాలకూర జ్యూస్ తాగడం వల్ల మన చర్మం, జుట్టు, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి డ్యామేజ్ సేల్స్ ని రిపేర్ చేస్తాయి. అంతేకాదు మనకు మచ్చలేని కాంతివంతమైన చర్మాన్ని అందిస్తాయి. పాలకూర జ్యూస్‌లో ఉండే విటమిన్స్, మినరల్స్ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహకరిస్తాయి. బలంగా మార్చడానికి తోడ్పడతాయి. అంతేకాదు జుట్టు బ్రేకేజ్ రాకుండా కాపాడుతాయి. పాలకూర జ్యూస్ తాగడం వల్ల మన శరీర ఆరోగ్యానికి మంచిది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది మంచి జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంతేకాదు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా నిర్వహిస్తుంది.

పాలకూర మన శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపించేసి స్కిన్ కాంప్లెక్స్ పెంచుతుంది. రెగ్యులర్ మీ డైట్ లో పాలకూర జ్యూస్ యాడ్ చేసుకోవటం వల్ల దీంతో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్స్..
పాలకూరలో పోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. పాలకూర జ్యూస్ లో అమోసిస్టైన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. దీంతో అదరోక్లోరోసిస్ సమస్యలు తగ్గుతాయి. ఇది లివర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది.

సంతాన సమస్యలు..
పాలకూర డైట్ లో చేర్చుకోవడం వల్ల ఫెర్టిలిటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు కొత్తగా తల్లులైన వారికి పాల ఉత్పత్తిని కూడా పెంచుతాయి అని ఓ నివేదిక తెలిపింది.

యాక్నె..
పాలకూరలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది నాచురల్ గా యాక్నేను చికిత్స చేయడంలో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది సెబం ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో ప్రాఫిఎక్టీరియం యాక్నే పెరుగుదలను నివారిస్తుంది.

ఇదీ చదవండి: మొలకెత్తిన గోధుమల మిరాకిల్స్‌.. ఇంట్లో తయారు చేసుకోవడం ఎలా?

క్యాన్సర్ నివారణ..
పాలకూరలో లూటీన్ ఫ్లేవనాయిడ్స్, క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటాయి. ఇది హానికర సేల్స్ పెరుగుదలను నివారిస్తుందని ఎన్ఐహెచ్ తెలిపింది. పాలకూర క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నివారిస్తుంది.

బలమైన జుట్టు..
ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా మెరవడానికి, జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది. హెయిర్ ఫాల్ సమస్య ఉన్నవాళ్లు, దురద సమస్య ఉన్నవాళ్లు పాలకూర రసాన్ని తీసుకోవాలి.

ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసేవారు ఈ 3 నివారించాలి.. లేదంటే ఆ సమస్య ఎప్పటికీ వేధిస్తుంది..

 కడుపు సమస్యలు..
పాలకూరలో విటమిన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఈ కడుపు సమస్యలు రాకుండా నివారిస్తుంది. అల్సర్ అజీర్తి మలబద్దకం సమస్యలకు మంచి ఎఫెక్టీవ్‌ రెమిడీ అని ఎన్‌హచ్‌ఐ తెలిపింది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News