New Rules from June: మరో మూడ్రోజుల్లో జూన్ 1 నుంచి మీ రోజువారీ బడ్జెట్ అంశాల్ని ప్రభావితం చేసే మార్పులు రానున్నాయి. ప్రతి నెలా మారే ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ కావచ్చు, రోజూ మారే పెట్రోల్-డీజిల్ ధరలు కావచ్చు బ్యాంకు సెలవులు, ట్రాఫిక్ నిబంధనలు, ఆధార్ అప్డేట్ అన్నీ మారుతున్నాయి. కొన్ని నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి. జూన్ నెల నుంచి అప్లై కానున్న ఆ రూల్స్ ఏంటో తెలుసుకుందాం.
జూన్ 1 నుంచి ప్రధానంగా మారనున్న అంశాల్లో ట్రాఫిక్ నిబంధనలున్నాయి. న్యూ డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ 2024 అమల్లో రానున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేస్తే 1000 నుంచి 2000 జరిమానా ఉంటుంది. అదే విధంగా లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తే 500 రూపాయలు ఫైన్ చెల్లించాలి. హెల్మెట్ లేకుండా లేదా సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణిస్తే 100 రూపాయలు పైన్ ఉంటుంది.
ఆధార్ కార్డు ఉచితంగా ఏ ఖర్చు లేకుండా అప్డేట్ చేసుకునేందుకు జూన్ 14 వరకూ గడువు మిగిలుంది. అంటే ఆన్లైన్లో ఉచితంగా ఆదార్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. అదే ఆధార్ కేంద్రానికి వెళితే 50 రూపాయలు ఫీజు చెల్లించాలి.
జూన్ నెలలో బ్యాంకుల సెలవుల్లో కూడా మార్పులున్నాయి. జూన్ నెలలో 10 రోజులకు బ్యాంకులకు సెలవులున్నాయి. ఇందులో ఆరు రోజులు రెండవ, నాలుగవ శనివారాలు, నాలుగు ఆదివారాలున్నాయి. మిగిలిన నాలుగు రోజుల్లో రాజా సంక్రాంతి, బక్రీద్ వంటివి ఉన్నాయి.
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కూడా మార్పులు రానున్నాయి. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఏకంగా 25 వేల వరకూ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు కావల్సిన వయస్సు 18 ఏళ్లు నిండి ఉండటం. మైనర్టు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే జరిమానాతో పాటు ఆ వెహికల్ ఓనర్ లైసెన్స్ రద్దు చేస్తారు. 25 ఏళ్లు వచ్చేవరకు ఆ మైనర్‌కు లైసెన్స్ జారీ కాదు. బ్లాక్ చేయబడుతుంది.
ఇక ప్రతి నెలా 1వ తేదీకు ఎల్పీజీ గ్యాస్ ధరలు మారనున్నాయి. ఆయిల్ కంపెనీలు జూన్ 1న గ్యాస్ ధరలపై నిర్ణయం తీసుకుంటాయి. కమర్షియల్ లేదా డొమెస్టిక్ సిలెండర్లపై పెంపు లేదా తగ్గింపు నిర్ణయం ఉంటుంది. లేదా అవే ధరల్ని కొనసాగించవచ్చు.
Also read: Best Tourist Places: వేసవిలో తిరిగేందుకు బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook