Samantha: ఆకట్టుకుంటున్న సమంత రేర్ ఫొటోస్.. సింపుల్ గా.. ఎంతో అందంగా..

Samantha rare photos: తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్ సమంత. తన మొదటి సినిమాతోనే.. తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ఈ హీరోయిన్ ఆ తరువాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ.. దూసుకుపోయింది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

1 /5

ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. నిజంగానే మాయ చేసేసిన హీరోయిన్ సమంత. తమిళ అమ్మాయి అయినా కానీ.. అచ్చం తెలుగమ్మాయిలా కనిపిస్తూ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది.

2 /5

ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ బృందావనం సినిమాతో మరో విజయం అందుకుంది. ఇక అప్పటినుంచి ఈ హీరోయిన్ కి వరస అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. సీనియర్ హీరోలు.. జూనియర్ హీరోలు అని తేడా లేకుండా దాదాపు అందరితోనూ నటించింది సమంత.

3 /5

కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే అక్కినేని వారసుడు నాగచైతన్యని పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ కలిసి నటించిన ఏమాయ చేసావే.. మనం.. మజిలీ.. లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి.

4 /5

వీరిద్దరి సినిమాలు విజయాలు సాధించిన వీరి పెళ్లి మాత్రం అపజయంగా మిగిలింది. నాలుగు సంవత్సరాల తరువాత వీరి వివాహిత జీవితంలో కొన్ని విభేదాలు రావడం వల్ల.. విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకి సమంతకి ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి.

5 /5

ఈ క్రమంలో ఈ మధ్యనే కోలుకున్న సమంత మళ్ళీ సినిమాలతో బిజీ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సమంత షేర్ చేసిన తన రేర్ ఫొటోస్..తెగ వైరల్ అవుతూ ఆమె అభిమానులను.. విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.