Garlic Juice Benefits: వెల్లుల్లి రసం పరగడుపున తాగితే.. ఈ ప్రయోజనలన్నీ మీ సొంతం..

Garlic Juice On Empty Stomach: వెల్లుల్లి మన వంటగదిలో నిత్యం అందుబాటులో ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి కూరలకు రుచి పెంచడం మాత్రమే కాదు ఎన్నో ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది. అందుకే ఆయుర్వేద పరంగా కూడా వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది.
 

1 /5

గుండె ఆరోగ్యం.. వెల్లుల్లి రసం తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకున్న ఫలకాలను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఉండే సల్పర్‌ను ఎర్ర రక్తకణాలు హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌గా మారుస్తుంది. దీంతో రక్తనాళాలు విస్తరిస్తయి. దీంతో గుండెకు రక్తప్రసరణ కూడా సులభంగా జరుగుతుంది.

2 /5

ఔషధ గుణాలు.. వెల్లుల్లిలో ఉండే ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. వెల్లుల్లి వల్ల మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు అందుతాయి. విటమిన్స్‌ మినరల్స్‌, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, జింక్‌, సల్ఫర్‌, మ్యాంగనీస్‌, సెలీనియం శరీర ఆరోగ్యానికి ప్రేరేపిస్తాయి

3 /5

బరువు తగ్గుతారు.. వెల్లుల్లిలో ఉండే పోషకాలు మెటబాలిజం రేటును పెంచుతుంది. దీంతో సులభంగా బరవు తగ్గుతారు. ఎందుకంటే వెల్లుల్లి ఆకలిని తగ్గిస్తుంది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు.

4 /5

శక్తి పెరుగుతుంది.. ఉదయం నిద్ర లేచినవెంటనే చాలామందికి నీరసంగా ఉంటుంది.వెల్లుల్లి రసం ఉదయం ఖాళీ కడుపున తసుకోవడం వల్ల తక్షణ లభిస్తుంది.  ఎందుకంటే వెల్లుల్లిలో ఫైటోకెమికల్స్‌ ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తాయి. సీజనల్‌ జబ్బులు కూడా మీ దరిచేరకుండా కాపాడతాయి.

5 /5

కొలెస్ట్రాల్‌ స్థాయిలు.. వెల్లుల్లిలో ఉండే ప్రధానమైన అల్లిసిన్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి. వీటిని మీడైట్లో తరచూ చేర్చుకోవడం వల్ల ఎల్‌డీఎల్‌ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )